డిసెంబర్ 31లోపు.. ఈ 3 పనులు చేయకపోతే నష్టపోతారు!

మనం కొన్ని పనులు తప్పక చేయాలి అని తెలిసినా కూడా తాత్సారం చేస్తూ ఉంటాం. గడువు ముగుస్తోంది అనగా ఆ పనులు చేయడం ప్రారంభిస్తాం. కానీ, ఆ పనులు ఒక పట్టాన పూర్తికావు. ఇప్పుడు డిసెంబరు 31లోగా పూర్తి చేయాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

మనం కొన్ని పనులు తప్పక చేయాలి అని తెలిసినా కూడా తాత్సారం చేస్తూ ఉంటాం. గడువు ముగుస్తోంది అనగా ఆ పనులు చేయడం ప్రారంభిస్తాం. కానీ, ఆ పనులు ఒక పట్టాన పూర్తికావు. ఇప్పుడు డిసెంబరు 31లోగా పూర్తి చేయాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

మనిషి ఆలోచన ప్రకారం ఏ పని అయినా కూడా గడువు ముగిసే వరకు చేయరు. ఎంత ఫ్రీగా ఉన్నా కూడా లాస్ట్ డేట్ వస్తేగానీ మనకి ఆ పని చేయడానికి మూడ్ రాదు. సమయం ఉన్నా కూడా తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులను పోస్ట్ బోన్ చేస్తూ ఉంటాం. ఖాళీగా ఉన్నా కూడా హా.. చేద్దాంలే అని ఊరుకుంటారు. అయితే అందరి ఆలోచనలు అలాగే ఉంటాయి కాబట్టి.. ఆఖరి తేది వచ్చేసరికి సంబంధిత వెబ్ సైట్స్ సరిగ్గా పని చేయకపోవచ్చు. మీరు పూర్తి చేయాలనుకున్న పని సరైన సమయంలో కంప్లీట్ కాకపోవచ్చు. అందుకే డిసెంబర్ 31లోపు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులను మీకోసం ఒకసారి అలర్ట్ చేస్తున్నాం.

ఆధార్ అప్ డేట్:

ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ తప్పకుండా ఉండాల్సిన డాక్యుమెంట్ గా మారిపోయింది. మీ గుర్తింపు కోసం మాత్రమే కాకుండా.. నగదు లావాదేవీలకు కూడా ఈ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కూడా ఇప్పుడు అన్నీ ఆధార్, ఆధార్ కనెక్టెడ్ ఫోన్ నంబరుతోనే ముడిపడి ఉంటున్నాయి. ఇప్పుడు ఆధార్ కి సంబంధించి మీరు పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. దానిని మీరు డిసెంబర్ 14లోపు పూర్తి చేస్తే మీకు లబ్ధి చేకూరుతుంది. అదేంటంటే.. మీ ఆధార్ కార్డుని అప్ డేట్ చేసుకోవాలి. గతంలో ఆధార్ కార్డుని జారీ చేసిన సమయంలో ఎన్నో తప్పులు దొర్లాయి.

అంతేకాకుండా చాలా మంది ఆ సమయంలో తప్పుడు వివరాలను కూడా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు వాటిని సరిచేసేందుకు పదేళ్లు దాటిన ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే ఈ సర్వీస్ ని ఉచితంగా చేసుకునేందుకు రెండుసార్లు గడువును కూడా ఫిక్స్ చేశారు. కానీ, ఊహించిన స్పందన రాకపోవడంతో మరో అవకాశాన్ని ఇచ్చారు. ఈ మేరకు మీరు డిసెంబర్ 14లోపు ఉచితంగా మీ ఆధార్ ని అప్ డేట్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు ఆన్ లైన్ లోనే Myaadhar.uidai.gov.in వెబ్ సైట్లో కూడా మీ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 దాటితే మాత్రం ఆ సేవలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

డీ మ్యాట్- ట్రేడింగ్ అకౌంట్:

చాలామంది షేర్ మార్కెట్ కి సంబంధించి కంపెనీ షేర్లు కొనడం, అమ్మడం చేస్తుంటారు. అలా చేయాలి అంటే మీకు కచ్చితంగా డీ- మ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు ఉండి తీరాలి. వాటి ద్వారానే మీరు ట్రేడింగ్ చేయగలుగుతారు. కానీ, ఇప్పుడు మీరు గనుక డిసెంబర్ 31లోపు ఈ పని పూర్తి చేయకపోతే మీరు ట్రేడింగ్ చేయలేరు. అదేంటంటే.. మీ డీమ్యాట్- ట్రేడింగ్ అకౌంట్లకు నామినీని అప్ డేట్ చేయడం. మీరు గనుక డిసెంబర్ 31లోపు నామినీని అప్ డేట్ చేయకపోతే మాత్రం మీ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. ఆ తర్వాత మీరు ట్రేడింగ్ చేయలేరు. అందుకే మీరు వెంటనే మీ అకౌంట్స్ కి నామినీని అప్ డేట్ చేసుకోండి.

లాకర్ సర్వీస్:

బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ ఎలాగో.. లాకర్స్ కూడా ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఎంతో విలువైన వస్తువులను మీరు ఆ లాకర్స్ లో పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండటం కంటే కూడా బ్యాంకులో ఉంటే మంచిది అని భావించిన విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు వంటివి లాకర్స్ లో పెట్టుకుంటారు. అలా బ్యాంకులో లాకర్ సర్వీస్ వాడుకున్నందుకు మీరు కొంత మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు గనుక ఈ డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే మీరు మీ లాకర్ సర్వీస్ ని కోల్పోయే ప్రమాదం ఉంది. అదేంటంటే.. మీరు డిసెంబర్ 31లోపు రివైజ్డ్ డాక్యుమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో మీ లాకర్ సర్వీస్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. మరి.. ఈ 3 ముఖ్యమైన పనులను మర్చిపోకుండా డిసెంబర్ 31లోపు పూర్తి చేయండి. లేదంటే మీరు అనవసరంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

Show comments