Vinay Kola
Schemes: సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యం. డబ్బులను సరిగ్గా సేవ్ చేయలేకపోతే చాలా కష్టం.కొన్ని మంచి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం వలన కచ్చితంగా మంచి లాభాలను పొందవచ్చు.
Schemes: సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యం. డబ్బులను సరిగ్గా సేవ్ చేయలేకపోతే చాలా కష్టం.కొన్ని మంచి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం వలన కచ్చితంగా మంచి లాభాలను పొందవచ్చు.
Vinay Kola
ఈ రోజుల్లో సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యం. సంపాదించిన డబ్బులను సరిగ్గా సేవ్ చేయలేకపోతే చాలా కష్టం. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు డబ్బులను జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది పెట్టుబడిదారులు సరిగ్గా అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టి బాగా నష్టపోతూ ఉంటారు. అయితే పెద్దగా రిస్క్ లేకుండా కొన్ని మంచి పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వలన కచ్చితంగా మంచి లాభాలను పొందవచ్చు. అటువంటి పథకాలు ఏంటి ? వాటి గురించి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) ద్వారా పెట్టుబడిదారులకు మంచి లాభాలు కలుగుతాయి. ఇది పెట్టుబడి పెట్టాలనుకునేవారికి సులభమైన మార్గం. ఇందులో ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు పెడితే కచ్చితంగా మంచి లాభాలను పొందవచ్చు. అలాగే ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీలో జీవన్ ఆనంద్ పాలసీ అనే మంచి స్కీం ఉంది. ఈ స్కీంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఇందులో తక్కువ ప్రీమియం చెల్లిస్తూ ఎక్కువ రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం ఒక టర్మ్ పాలసీ. ఇందులో పాలసీ పూర్తయ్యే వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఇందులో మీరు రోజుకు 45 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే నెలకు 1358 రూపాయలవుతుంది. ఈ పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి మీకు ఏకంగా రూ. 25 లక్షలు వస్తాయి.
ఈ పాలసీ కాల వ్యవధి విషయానికి వస్తే..15 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉంటుంది.. రోజుకు 45 రూపాయల చొప్పున 35 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తరువాత ఒకేసారి 25 లక్షల రూపాయల భారీ మొత్తం పొందుతారు. ఇందులో మీరు ఏడాదికి పెట్టుబడిగా పెట్టేది రూ. 16,300. అంటే నెలకు రూ. 1358 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 16,300 అవుతుంది. ఈ పథకంలో 35 ఏళ్లకు మీరు పెట్టుబడి పెట్టె డబ్బులు కేవలం రూ. 5,70,500 మాత్రమే. కానీ ఇందులో పెట్టుబడి పెడితే ఫైనల్ గా 25 లక్షలు పొందుతారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో కచ్చితంగా కనీసం 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. లేదంటే లాభాలు పొందలేరు. ఇక ఈ పథకాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.