iDreamPost
android-app
ios-app

సీనియర్ సిటీజన్లకు శుభవార్త.. ఈ బ్యాంకుల్లో FDలపై అధిక వడ్డీ పొందవచ్చు!

  • Published Oct 24, 2024 | 6:19 PM Updated Updated Oct 24, 2024 | 6:19 PM

Fixed Deposit: ఫిక్సెడ్ డిపాజిట్ అనేది సీనియర్ సిటీజనులకు చాలా సురక్షితమైన పెట్టుబడి మార్గం. అయితే కొన్ని బ్యాంకులు ఫిక్సెడ్ డిపాజిట్ లపై ఎక్కువ వడ్డీ రేట్లని ఇస్తున్నాయి.

Fixed Deposit: ఫిక్సెడ్ డిపాజిట్ అనేది సీనియర్ సిటీజనులకు చాలా సురక్షితమైన పెట్టుబడి మార్గం. అయితే కొన్ని బ్యాంకులు ఫిక్సెడ్ డిపాజిట్ లపై ఎక్కువ వడ్డీ రేట్లని ఇస్తున్నాయి.

సీనియర్ సిటీజన్లకు శుభవార్త.. ఈ బ్యాంకుల్లో FDలపై అధిక వడ్డీ పొందవచ్చు!

మన ఆదాయాన్ని పెంచే మంచి పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకటి. వీటిలో పెద్దగా రిస్క్ అనేది ఉండదు. సీనియర్ సిటిజన్లకు అయితే చాలా బెస్ట్. ఇందులో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే వడ్డీ రేటనేది బ్యాంకును బట్టి మారుతుంటుంది. అయితే ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ రాబడి అందుకోవచ్చు.అయితే, చాలా మంది సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కువగా పెద్ద బ్యాంకుల్లో FD లు చేస్తారు. కానీ, వాటిల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. స్పెషల్ స్కీమ్స్ ద్వారా మాక్సిమం 8 శాతం మాత్రమే వడ్డీ రేట్లు ఇస్తాయి పెద్ద బ్యాంకులు. అయితే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఏకంగా 9 శాతానికిపైగా వడ్డీ ఇస్తున్నాయి. ఇక ఆ బ్యాంక్స్ ఏంటి ? వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సీనియర్ సిటీజనులకు నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ, యూనిటీ, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటుని ఇస్తున్నాయి. ఇక ముందుగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 2 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల టెన్యూర్ ఉండే డిపాజిట్లపై మాక్సిమంగా 9.10 శాతం వడ్డీ వస్తుంది. ఇందులో మీరు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే 3 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత మీకు మొత్తం రూ. 6,33,600 దాకా డబ్బులు వస్తాయి. ఇక నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ బ్యాంకులో 2 నుంచి 3 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు మాక్సిమం 9.50 శాతం వడ్డీని ఇస్తారు. ఈ బ్యాంకులో 3 సంవత్సరాల టెన్యూర్ పై రూ.5 లక్షలు FD చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 6,44,550 దాకా వస్తాయి.

ఇక యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. విషయానికి వస్తే .. ఈ బ్యాంకులో 3 సంవత్సరాల టెన్యూర్ కు మాక్సిమం 9.50 శాతం వడ్డీ వస్తుంది. ఇక రెండు సంవత్సరాల డిపాజిట్లపై అయితే ఈ బ్యాంక్ 9.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 3 సంవత్సరాల టెన్యూర్ పై రూ.5 లక్షలు FD చేస్తే మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత చేతికి రూ. 6,27,500 దాకా డబ్బులు వస్తాయి.ఇక ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 3 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై 9.10 శాతం వడ్డీ వస్తుంది. ఇక 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న టెన్యూర్లపై 9.25 శాతం వడ్డీ వస్తుంది. మూడు సంవత్సరాలకు రూ.5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీ పూర్తయ్యాక మీ చేతికి రూ. 6,24,150 దాకా వస్తాయి. కాబట్టి సీనియర్ సిటీజనులు ఈ బ్యాంకుల్లో FD చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఇక FD లపై అధిక వడ్డీ ఇచ్చే ఈ బ్యాంకుల గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.