iDreamPost
android-app
ios-app

ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు.. ఏ ఏ బ్యాంకులు ఎంత ఇస్తున్నాయంటే?

  • Published Jun 09, 2024 | 4:55 PM Updated Updated Jun 09, 2024 | 4:55 PM

More Interest Rates On FDs: రిస్క్ లేకుండా స్థిరమైన వడ్డీ రేటు రావాలి.. అందులోనూ ఎక్కువ వడ్డీ రేటు కావాలి అని అనుకుంటున్నారా? అయితే ఏ ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుని అందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మేలు.

More Interest Rates On FDs: రిస్క్ లేకుండా స్థిరమైన వడ్డీ రేటు రావాలి.. అందులోనూ ఎక్కువ వడ్డీ రేటు కావాలి అని అనుకుంటున్నారా? అయితే ఏ ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుని అందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మేలు.

ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు.. ఏ ఏ బ్యాంకులు ఎంత ఇస్తున్నాయంటే?

ఎటువంటి రిస్క్ లేకుండా మంచి స్థిరమైన రాబడి పొందాలనుకునేవారికి ఉన్న ఆప్షన్ ఫిక్డ్స్ డిపాజిట్స్. మాకు రిస్క్ వద్దు అనుకునేవారికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉత్తమమైన ఛాయిస్. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం ఈ ఎఫ్డీలు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. సాధారణ ఫిక్స్డ్ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు దాదాపు 0.50 శాతం ఎక్కువగా ఉంటుంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏ ఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీ ఇస్తుందో? 2 కోట్ల రూపాయల లోపు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్ కి వచ్చే వడ్డీ ఎంతో అనే వివరాలు మీ కోసం.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏడాది పాటు డిపాజిట్ చేసే అమౌంట్ పై సీనియర్ సిటిజన్స్ కి 9 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. మూడేళ్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తుండగా.. ఐదేళ్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తుంది. ఇక ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అయితే సీనియర్ సిటిజన్స్ చేసే ఏడాది డిపాజిట్లపై గరిష్టంగా 8.70 శాతం వడ్డీ ఇస్తుంది. మూడేళ్ళ డిపాజిట్లపై 8.50 శాతం, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది.  

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడాది ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీ లభిస్తుండగా.. మూడేళ్ళ ఎఫ్డీలపై 7 శాతం, ఐదేళ్ల ఎఫ్డీలపై 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. 
  • యూనియన్ బ్యాంకులో ఏడాది డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్ కి 7.25 శాతం వడ్డీ వస్తుండగా.. మూడేళ్లు, ఐదేళ్ల డిపాజిట్లపై 7 శాతం వడ్డీ లభిస్తుంది. 
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏడాది డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ వస్తుండగా.. మూడేళ్ళ డిపాజిట్లపై 7.50 శాతం, ఐదేళ్లకు 7 శాతం వడ్డీ లభిస్తుంది.  
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీ వస్తుండగా.. మూడేళ్లకు 7.25 శాతం, ఐదేళ్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడాది డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీ ఇస్తుండగా.. మూడేళ్ళ ఎఫ్డీలపై 7.25 శాతం, ఐదేళ్ల ఎఫ్డీలపై 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.
  • సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఏడాది డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీ వస్తుండగా.. మూడేళ్ల డిపాజిట్లపై 9.10 శాతం, ఐదేళ్లకు 8.75 శాతం వడ్డీ వస్తుంది. 
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్ కి ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీ ఇస్తుండగా.. మూడేళ్ల ఎఫ్డీలపై 8.10 శాతం, ఐదేళ్లకు 8.25 శాతం వడ్డీ వస్తుంది. 
  • కోటక్ మహీంద్రా బ్యాంకు ఏడాది డిపాజిట్లపై, మూడేళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.70 శాతం వడ్డీ ఇస్తుంది. ఏడాది డిపాజిట్లపై బంధన్ బ్యాంక్ 8.35 శాతం వడ్డీ ఇస్తుండగా.. మూడేళ్ల డిపాజిట్లపై 7.75 శాతం ఇస్తుండగా.. ఐదేళ్ల డిపాజిట్లపై 6.60 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది.
  • ఇండస్ ఇండ్ బ్యాంకు అయితే ఎఫ్డీలపై 8.25 వార్షిక వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. మూడేళ్లకు, ఐదేళ్ల డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది. 
  • క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. మూడేళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.65 శాతం వడ్డీ ఇస్తుండగా.. ఐదేళ్ల డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీ ఇస్తుంది. 
  • ఎస్ బ్యాంకులో ఏడాది డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ వస్తుండగా.. మూడేళ్లు, ఐదేళ్ల ఎఫ్డీలపై 8 శాతం వడ్డీ వస్తుంది.