iDreamPost
android-app
ios-app

FD చెయ్యాలనుకుంటున్నారా? ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్స్ ఇవే..

  • Published Sep 11, 2024 | 5:30 AM Updated Updated Sep 11, 2024 | 5:30 AM

Fixed Deposites: కొన్ని బ్యాంకులు మంచి వడ్డీరేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ లను అమలు చేస్తున్నాయి. ఎఫ్ డీలపై మంచి వడ్డీ రేట్లని ఇచ్చే బ్యాంక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Fixed Deposites: కొన్ని బ్యాంకులు మంచి వడ్డీరేట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ లను అమలు చేస్తున్నాయి. ఎఫ్ డీలపై మంచి వడ్డీ రేట్లని ఇచ్చే బ్యాంక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

FD చెయ్యాలనుకుంటున్నారా? ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్స్ ఇవే..

డబ్బులను దాచుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాల చేస్తారు. చాలా మార్గాల్లో పెట్టుబడులు పెడతారు. కానీ అవి సురక్షితమో కాదో చెప్పలేము. అయితే డబ్బులు సురక్షితంగా ఉండాలంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లు మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు అత్యంత సురక్షితమైనవి. ముఖ్యంగా డబ్బులు పొదుపు చేయడానికి చాలా సేఫ్ గా ఉంటాయి. మనం పెట్టుబడి పెట్టిన డబ్బుని నిర్ణీత సమయానికి అసలుతో పాటు వడ్డీని కలిపి తీసుకునే అవకాశం ఎఫ్ డీలకి ఉంది. కొన్ని బ్యాంకులు మంచి వడ్డీరేట్లతో ఎఫ్ డీలను అమలు చేస్తున్నాయి. ఎఫ్ డీలపై మంచి వడ్డీ రేట్లని ఇచ్చే బ్యాంక్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఐసీఐసీఐ బ్యాంకు  ‌7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ ఇస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్ పై సాధారణ ఖాతాదారులకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ ఇస్తుంది. అలాగే ఒక ఏడాది నుంచి 15 నెలల లోపు 6.70 శాతం సాధారణ ఖాతాదారులకు, 7.20 శాతం సీనియర్ సిటిజన్ లకు వడ్డీ రేటుని ఇస్తుంది. ఇక 18 నెలల నుంచి రెండేళ్ల లోపు అయితే 7.25 శాతం నుంచి 7.75 శాతం దాకా వడ్డీ రేటుని ఇస్తుంది. రెండేళ్ల నుంచి ఐదేళ్ల లోపు 7 శాతం నుంచి 7.50 శాతం ఇస్తుంది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 6.90 శాతం నుంచి 7.40 శాతం వడ్డీ రేటుని అందిస్తుంది. ఇక ఐదేళ్ల టాక్స్ సేవర్ ఎఫ్ డీకి 7 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ రేటుని ఇస్తుంది. 

These banks are good for Fixed Deposits 02

ఇక యాక్సిస్ బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లపై మంచి వడ్డీ రేటుని ఇస్తుంది.   7 రోజుల నుంచి 14 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 3.50 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 4 శాతం వడ్డీ ఇస్తుంది. ఇక ఏడాది నుంచి 13 నెలల లోపు 6.70 శాతం నుంచి  7.20 శాతం వడ్డీ ఇస్తుంది. రెండేళ్ల నుంచి 30 నెలల లోపు 7.10 శాతం నుంచి 7.60 శాతం వడ్డీని ఇస్తుంది. 30 నెలల నుంచి మూడేళ్ల లోపు 7.10 శాతం (సాధారణ), 7.60 శాతం వడ్డీని ఇస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు 7.10 శాతం (సాధారణ), 7.60 శాతం వడ్డీని ఇస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7. 10శాతం నుంచి  7.75 శాతం వడ్డీని ఇస్తుంది.  ఇక ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక: ఈ సమాచారం పలువురు మర్కెట్ నిపుణులు తెలిపిన వివరాల మేరకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైన పెట్టుబడులు పెట్టే ముందు ఆయా రంగాల నిపుణులను సంప్రదించడం ఉత్తమం.