iDreamPost
android-app
ios-app

Banks: పర్సనల్ లోన్ కావాలా? తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్స్ ఇవే!

  • Published Sep 07, 2024 | 12:30 AM Updated Updated Sep 07, 2024 | 12:30 AM

Personal Loans: పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. ఇక కొన్ని బ్యాంకుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Personal Loans: పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. ఇక కొన్ని బ్యాంకుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Banks: పర్సనల్ లోన్ కావాలా? తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్స్ ఇవే!

మనకు డబ్బులు ఎప్పుడు అవసరం అవుతాయో చెప్పలేము. కొన్ని సార్లు మన దగ్గర డబ్బు లేనప్పుడు లోన్ అవసరం పడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో పర్సనల్ లోన్లు తక్కువ డాక్యుమెంటేషన్‌తోనే అందుబాటులోకి వస్తున్నాయి. చాలా బ్యాంక్స్ కూడా చాలా వేగంగా పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ అప్లై చేసుకున్న వెంటనే చాలా త్వరగా అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. అయితే బ్యాంకుల్లో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి? వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యాక్సిస్ బ్యాంకులో వడ్డీ రేట్లు 11.25 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజ్ 2 శాతం దాకా ఉంటుంది. ఇక టాటా క్యాపిటల్‌లో 10.99 శాతం నుంచి వడ్డీ రేట్లు మొదలవుతున్నాయి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు 5.5 శాతం దాకా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకులో పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లు 10.85 శాతం నుంచి స్టార్ట్ కానున్నాయి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం దాకా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనుక లోన్ వడ్డీ రేటు చూసినట్లైతే.. 11.35 శాతం నుంచి 15.50 శాతం దాకా ఉంటుంది. ఈ బ్యాంక్ ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో కేవలం 1.50 శాతం దాకా మాత్రమే ఉంది.

ఇక HDFC బ్యాంకులో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు 10.75 శాతం నుంచి 24.00% శాతం దాకా ఉంటుంది. ఇందులో ప్రోసెసింగ్ ఫీజు రూ.4,999 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి అదనంగా GST కూడా ఉంటుంది. ఇక HSBC బ్యాంకులో పర్సనల్ లోన్లపై 9.99 శాతం నుంచి 16.00 శాతం దాకా వడ్డీ రేట్లు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు 2% దాకా ఉంటుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో పర్సనల్ లోన్లపై 10.49 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉంటాయి. ఇక ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే.. 3.5 శాతం నుంచి ఉంటుంది. ఇక ఎస్ బ్యాంక్ పర్సనల్ లోన్లపై 10.99 శాతం నుంచి వడ్డీ రేట్లని అందిస్తుంది. 2.5 శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా పర్సనల్ లోన్లపై 10.99 శాతం నుంచి వడ్డీ రేట్లని అందిస్తుంది. ఇందులో 3 శాతం ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది.