iDreamPost
android-app
ios-app

త్వరలో ఆ గ్యాస్ కనెక్షన్లను తొలగింపు! లిస్ట్ లో మీరు ఉన్నారో లేదో తెలుసుకోండి!

  • Published Jul 12, 2024 | 5:53 PM Updated Updated Jul 12, 2024 | 5:53 PM

LPG Gas E-Kyc: చాలామంది ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ ను రెసిడెన్షియల్ పేర్లతో బుక్ చేసుకొని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. అయితే అలాంటి ఎల్‌పీజీ కస్టమర్‌లను ధ్రువీకరించడానికి, నకిలీ ఖాతాలను తొలగించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

LPG Gas E-Kyc: చాలామంది ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ ను రెసిడెన్షియల్ పేర్లతో బుక్ చేసుకొని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. అయితే అలాంటి ఎల్‌పీజీ కస్టమర్‌లను ధ్రువీకరించడానికి, నకిలీ ఖాతాలను తొలగించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Jul 12, 2024 | 5:53 PMUpdated Jul 12, 2024 | 5:53 PM
త్వరలో ఆ గ్యాస్ కనెక్షన్లను తొలగింపు! లిస్ట్ లో మీరు ఉన్నారో లేదో తెలుసుకోండి!

ఈ రోజుల్లో గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు అంటూ ఎక్కడ లేదు. ఎందుకంటే.. దేశంలో ఇప్పుడు పట్టణాల మొదలుకుని మారుమూల పల్లెల వరకు అందరి ఇంట్లో వంట గ్యాస్ కచ్చితంగా ఉంటుంది. అయితే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. కానీ, ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ అందుబాటులోకి రావడంతో అందరీ ఇంట్లో ఈ వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా గృహ వినియోగదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించడం జరుగుతుంది.కానీ, కొంతమంది మాత్రం నకిలీ గ్యాస్ కనెక్షన్లతో గృహ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల ప్రభుత్వం గుర్తించింది.అయితే అలాంటి ఎల్‌పీజీ కస్టమర్‌లను ధ్రువీకరించి, వెంటనే నకిలీ ఖాతాలను తొలగించడానికి ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. కాగా, ఈ-కేవైసీ పేరిట త్వరలోనే నకిలీ ఖాతాలను తొలగించేందుకు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చాలామంది ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ ను రెసిడెన్షియల్ పేర్లతో బుక్ చేసుకొని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. అయితే అలాంటి ఎల్‌పీజీ కస్టమర్‌లను ధ్రువీకరించడానికి, నకిలీ ఖాతాలను తొలగించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రమాణీకరణను ఉపయోగిస్తున్నాయని చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తాజాగా తెలిపారు.  ముఖ్యంగా మోసపూరిత కస్టమర్ లను గుర్తించి తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంటుంది. మరి, ప్రభత్వం నిర్ణయం తీసుకున్న ఎల్‌పీజీ ఈ-కేవైసీ వివరాలేంటో తెలుసుకుందాం.

కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్.. గ్యాస్ కనెక్షన్స్ విషయంలో కేంద్రం తీసుకున్ననిర్ణయం వలన సామాన్యులు ఇబ్బంది పడుతున్నరని పేర్కొనడంతో తాజాగా కేంద్రం స్పందించింది. అయితే ఈ ప్రక్రియ గత ఎనిమిది నెలలుగా అమల్లో ఉందని,  అలాగే ఈ-కేవైసీకు చివరి తేదీ అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. ఇక ఎల్‌పీజీ డెలివరీ సిబ్బంది, వినియోగదారులకు రీఫిల్‌లను పంపిణీ చేస్తున్నప్పుడు ఆధారాలను ధ్రువీకరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే.. మొదట డెలివరీ సిబ్బంది రీఫిల్ లను పంపిణీ చేసినప్పుడు తమ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కస్టమర్‌కు సంబంధించిన ఆధార్ ఆధారాలను యాప్ ద్వారా క్యాప్చర్ చేస్తారు.

ఆ తర్వాత కస్టమర్ ప్రాసెస్‌ను పూర్తి చేసిన అనంతరం ఓటీపీ వస్తుంది. ఇక ఆ ఓటీపీని కస్టమర్లు డెలివరీ సిబ్బందికి చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో కస్టమర్ అందుబాటులో లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ను కూడా సంప్రదించాలని వివరించారు. ముఖ్యంగా ఈ ఫ్రొసెస్ లో వినియోగదారులు చమురు కంపెనీ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకుని ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని వివరిస్తున్నారు. ఇలా ఈ-కేవైసీ ప్రక్రియలో చేయడం వలను ఇందులో నకిలీ గ్యాస్ కనెక్షన్లు ఏవో ఉన్నాయో గుర్తించవచ్చని, తక్షణమే వాటిని తొలిగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. మరి, ఈ-కేవైసీ ప్రక్రియ ద్వారా నకిలీ  గ్యాస్ కనెక్షన్లను తొలగించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అబిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.