Dharani
Tesla-Rs 28000 Per Single Day: రోజుకు 7 గంటలే పని.. గంటకు 4 వేల చొప్పున రోజుకు 28 వేల వేతనం.. అబ్బా ఎక్కడ ఈ జాబ్.. త్వరగా చెప్పండి వెళ్తాను అంటారా.. అయితే ఇది మీ కోసమే..
Tesla-Rs 28000 Per Single Day: రోజుకు 7 గంటలే పని.. గంటకు 4 వేల చొప్పున రోజుకు 28 వేల వేతనం.. అబ్బా ఎక్కడ ఈ జాబ్.. త్వరగా చెప్పండి వెళ్తాను అంటారా.. అయితే ఇది మీ కోసమే..
Dharani
మన దేశంలో సాధారణంగా ప్రైవేటు కంపెనీల్లో చేరే ఉద్యోగులకు ప్రారంభ వేతనం.. 10-15 వేల మధ్యనే ఉంటుంది. హై ప్రొఫైల్ జాబ్స్ తప్పించి.. మిగతా చోట్ల వేతనాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే కనీస వేతనం 21 వేల రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ దీనిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మన దగ్గర నెలంతా కష్టపడితే 15 వేల రూపాయలు రావడం గొప్ప. అనుభవం పెరుగుతున్న కొద్ది వేతనం కూడా పెరుగుతుంది. కానీ మరీ ఇప్పుడు మేం చెప్పబోయేంత మాత్రం కాదు. ఇప్పుడు మేం చెప్పబోయే కంపెనీ.. రోజు 28 వేల రూపాయల వేతనం ఆఫర్ చేస్తుంది. పైగా 7 గంటల పనే. దీని గురించి తెలిసిన వారు ఇది కదా జాబ్ అంటే.. ఎక్కడో చెప్పండి మేం వెళ్తాం అంటున్నారు. మరి ఈ ఉద్యోగం ఎక్కడ అంటే..
రోజుకు 7 గంటలు మాత్రమే పని చేస్తూ.. గంటకు ఏకంగా 4 వేల రూపాయల జీతం.. అంటే రోజుకు రూ.28 వేల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది ఓ కంపెనీ. అదే అమెరికన్ కంపెనీ టెస్లా. ఇక ఈ ఉద్యోగంలో చేరిన వ్యక్తులు గంటకు 4వేల చొప్పున 7 గంటలకు 28 వేల రూపాయల వేతనం పొందవచ్చు. టెస్లా ఆఫర్ చేస్తోన్న ఈ జాబ్ ఎక్కడంటే.. కంపెనీకి చెందిన రోబో ట్రైనింగ్ సెంటర్లో.
టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ ను వేగంగా డెవలప్ చేస్తుంది. ఇందులో భాగమైన మోషన్ క్యాపప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్ లకు ట్రైనింగ్ ఇవ్వడానికి టెస్లా రెడీ అయ్యింది. దీని కోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వారికి ఇది గొప్ప సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
టెస్లా కంపెనీ ప్రకటించిన ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులు మోషన్ క్యాప్చర్ సూట్ అండ్ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ధరించి రోజు ఏడు గంటల సమయం నిర్దిష్ట మార్గాల్లో నడవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే డేటా సేకరించడం, విశ్లేషించడం వంటివి చేయాలి. వీటితో పాటు ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తి ఎత్తు 5.7-5.11 ఎత్తు ఉండాలి. అలానే 13 ఫౌండ్స్ బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అని చెప్పుకొచ్చింది.
ఉద్యోగంలో మూడు షిఫ్టులు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అవి ఉదయం 8-4.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు.. మూడో షిఫ్ట్ అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు ఉంటుంది. అంటే ఈ ఉద్యోగంలో చేరాలనుకునేవారు.. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో చేయాల్సి ఉంటంది.