iDreamPost
android-app
ios-app

ఇంకొన్ని రోజుల్లో పెరగనున్న ల్యాండ్ రేట్లు.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు!

  • Published Jul 29, 2024 | 3:28 PM Updated Updated Jul 29, 2024 | 3:28 PM

Telangana Govt Decided To Increase Market Value Of Properties: తక్కువ టైంలో భారీ లాభాలు పొందాలా? అయితే ఇదే సరైన అవకాశం. హైదరాబాద్ లో గానీ నగర శివారులో గానీ భూములు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేస్తే 15 రోజుల్లోనే మీరు లాభాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాపర్టీ ధరలు పెరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ విలువను పెంచబోతుంది.

Telangana Govt Decided To Increase Market Value Of Properties: తక్కువ టైంలో భారీ లాభాలు పొందాలా? అయితే ఇదే సరైన అవకాశం. హైదరాబాద్ లో గానీ నగర శివారులో గానీ భూములు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేస్తే 15 రోజుల్లోనే మీరు లాభాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాపర్టీ ధరలు పెరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ విలువను పెంచబోతుంది.

ఇంకొన్ని రోజుల్లో పెరగనున్న ల్యాండ్ రేట్లు.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు!

హైదరాబాద్ లో లేదా నగర శివారులో ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టిన వారికి గుడ్ న్యూస్. గతంలో ఎవరైనా స్థలాలు, ఫ్లాట్ లు, భూములు కొనుగోలు చేశారో వారికి ఇప్పుడు భారీ లాభాలు రానున్నాయి. ముఖ్యంగా స్థలాలు కొన్నవారికి ఎక్కువ లాభాలు రానున్నాయి. ఎందుకంటే తెలంగాణలో భూములు, ఖాళీ స్థలాలు, నివాస గృహాలకు సంబంధించి మార్కెట్ విలువను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఓపెన్ మార్కెట్ విలువలు, పెంచాలనుకుంటున్న విలువను అంచనా వేసుకుని నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, ప్రాంతాల వారీగా నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నివేదికలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి అనుమతి ఇవ్వనున్నారు. అనుమతి ఇస్తే ప్రాపర్టీల మార్కెట్ విలువ పెరుగుతుంది.

కమర్షియల్ ఏరియా, నాన్ కమర్షియల్ ఏరియా ఇలా ప్రాపర్టీని విభజించి మార్కెట్ విలువను నిర్ణయించనున్నారు. గతంలో నాన్ కమర్షియల్ ఏరియాగా ఉండి ఇప్పుడు అక్కడ కమర్షియల్ గా అభివృద్ధి అయి ఉంటే కనుక స్థలాలు, ఎంత వీలయితే అంత మార్కెట్ విలువను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూములు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్ విలువను పెంచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ, ఓపెన్ మార్కెట్ విలువను రెండిటినీ బేరీజు వేసుకుని మార్కెట్ విలువను పెంచే అవకాశం ఉంది. ఓపెన్ ప్లాట్ల ధరలు ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ మార్కెట్ విలువలో 50 శాతానికి మించి మార్కెట్ విలువను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అపార్ట్మెంట్ కొనుగోలుపై మార్కెట్ విలువ కన్నా 20 శాతం నుంచి 35 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువను 50 శాతం లోపు ఎంతయినా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన అయితే చేయనున్నారు. ఆగస్టు 15 తర్వాత పెరిగిన మార్కెట్ ధరలు అమలులోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాబట్టి ఈ 15 రోజుల్లోపు ఎవరైతే స్థలాలు కొనుగోలు చేస్తారో వారికి లాభాలు ఉంటాయి. అంతకు ముందు కొన్నవారు ఆగస్టు 15 తర్వాత అమ్మితే వారికి భారీ లాభాలు ఉంటాయి. ఎవరైనా స్థలం కొనాలి అని అనుకుంటే కనుక ఆగస్టు 15 లోపు కొనేయడం మంచిది. ఇక అపార్ట్మెంట్ ధరలు కూడా పెరుగుతాయి కాబట్టి ఫ్లాట్లు అమ్మే ఉద్దేశం ఉన్నవారు ఆగస్టు 15 తర్వాత అమ్ముకోవడం మంచిది.