iDreamPost
android-app
ios-app

HYDలో మరో సైబరాబాద్! రేవంత్ సర్కార్ ఫోకస్.. ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులవ్వడం పక్కా!

  • Published Jul 17, 2024 | 6:03 PM Updated Updated Jul 17, 2024 | 6:03 PM

Telangana Govt Decide To Develop Maheshwaram Area Like Cyberabad: హైదరాబాద్ లో న్యూయార్క్ సిటీని తలదన్నేలా మరో కొత్త నగరాన్ని ఆ ఏరియాలో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి స్థలాలు కొని భారీగా లాభాలు పొందాలని భావించేవారికి ఇదే సరైన అవకాశం.

Telangana Govt Decide To Develop Maheshwaram Area Like Cyberabad: హైదరాబాద్ లో న్యూయార్క్ సిటీని తలదన్నేలా మరో కొత్త నగరాన్ని ఆ ఏరియాలో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి స్థలాలు కొని భారీగా లాభాలు పొందాలని భావించేవారికి ఇదే సరైన అవకాశం.

HYDలో మరో సైబరాబాద్! రేవంత్ సర్కార్ ఫోకస్.. ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులవ్వడం పక్కా!

రేవంత్ సర్కార్ ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్ ని మరింత విస్తరించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న 29 మున్సిపాలిటీలను రెండు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. జీహెచ్ఎంసీకి ఒకవైపు ఉన్న మేడ్చల్, నిజాంపేట్, దమ్మాయిగూడ, జవహర్ నగర్, నాగారం, పీర్జాదిగూడ, పోచారం, బోడుప్పల్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, తూంకుంట, కొంపల్లి, ఘట్కేసర్, అబ్దుల్లాపూర్మెట్ మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ఉన్న అమీన్ పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలను ఎందులో కలపాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ఇక జీహెచ్ఎంసీకి మరోవైపు ఉన్న మణికొండ, బండ్లగూడ జాగీర్, నార్సింగి, జల్పల్లి, ఆదిభట్ల, బడంగ్ పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, తుక్కుగూడ వంటి మున్సిపాలిటీలతో మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ మహేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలో మహేశ్వరం ప్రాంతాన్ని మహానగరంగా మారుస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే జరిగితే మహేశ్వరం ఏరియా రూపురేఖలే మారిపోతాయి. యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలు, కాలుష్యానికి తావివ్వకుండా ఫార్మా కంపెనీలు పెట్టాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీ తయారీ పరిశ్రమలను తీసుకురావాలని, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

హైదరాబాద్ లో సైబరాబాద్ సిటీని ఎలా అయితే క్రియేట్ చేశారో.. అలాంటి సిటీని న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో మహాశ్వరం ఏరియాకు మహర్దశ పట్టనుంది. కాబట్టి మహేశ్వరం ఏరియాలో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారికి భవిష్యత్తులో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం చదరపు అడుగు స్థలం యావరేజ్ గా రూ. 1650 వద్ద కొనసాగుతుంది. అంటే గజం స్థలం కొనాలంటే యావరేజ్ గా రూ. 14,850 రూపాయలు అవుతుంది. ఒక 25 లక్షలు పెట్టుకుంటే 150 గజాల స్థలం వస్తుంది. రేవంత్ సర్కార్ కనుక చెప్పినట్టే మహేశ్వరం ప్రాంతాన్ని మరో సైబరాబాద్ గా తీర్చిదిద్దితే గనుక ఈ ఏరియాలో స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. పెట్టిన పెట్టుబడి డబుల్, త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదే సరైన అవకాశం.