iDreamPost
android-app
ios-app

స్థలాలు ఇప్పుడే కొనేస్తే మంచిది.. లేకుంటే అదనపు భారం తప్పదు!

Land Registration Charges: ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే స్థలాలు కొనుగోలు చేేసుకోండి. లేదంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే?

Land Registration Charges: ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే స్థలాలు కొనుగోలు చేేసుకోండి. లేదంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే?

స్థలాలు ఇప్పుడే కొనేస్తే మంచిది.. లేకుంటే అదనపు భారం తప్పదు!

సంవత్సరాలు గడిచినా కూడా విలువ పెరగడమే తప్పా తగ్గని ఒకే ఒక్కటి భూమి. జనాభా పెరుగుదలతో భూములకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉండడం భూముల లభ్యత తక్కువగా ఉండడంతో ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భూములపై పెట్టుబడి వేలల్లో పెడితే లక్షల్లో, లక్షల్లో పెడితే కోట్లల్లో లాభం వస్తుందనడంలో సందేహం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. మరి మీరు కూడా ల్యాండ్ పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే స్థలాలను కొనేయండి. లేదంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్​ విలువల పెంపునకు రెడీ అవుతోంది.

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే ఖాళీ స్థలాలపై ఎక్కువగా పెంచే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ వాల్యూ 30 శాతం పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు అధికారులు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జోన్ల వారీగా రివ్యూ చేసి రూ. 4 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తోంది. సీఎం రేవంత్ అనుమతిస్తే రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు రూట్ క్లియర్ అవుతుందంటున్నారు అధికారులు. రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచితే గనక ల్యాండ్ కొనుగోలుదారులకు అదనపు భారం తప్పదంటున్నారు నిపుణులు.

 

ఇప్పటికే రెవెన్యూ శాఖతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ క్షేత్ర స్థాయిలో పర్యటించి మార్కెట్ విలువను పరిశీలించారు. మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూములు, గృహాలు, ఖాళీ స్థలాల ఓపెన్ మార్కెట్ విలువలు, పెంచాలనుకుంటున్న విలువలకు సంబంధించిన అంచనా నివేదికలను రెడీ చేసినట్లు సమాచారం. ఈ నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి అనుమతిస్తే రిజిస్ట్రేషన్ విలవలు, మార్కెట్ విలువలు పెరగనున్నాయి. మార్కెట్ విలువ పెరిగితే ఇప్పటికే భూములు కొన్నవారికి లాభం వస్తుంది. కొనుగోలు చేయాలనుకునే వారికి అదనపు భారం తప్పదంటున్నారు నిపుణులు.