iDreamPost
android-app
ios-app

కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. భారీ డిస్కౌంట్ ప్రకటించిన టాటా, మహీంద్రా కంపెనీలు

Huge Discounts On Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఎంపిక చేసిన కార్ల మీద భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం కార్ల ధరలు తగ్గాయి. అయితే ఈ డిస్కౌంట్ ఎన్ని రోజులు ఉంటుందంటే?

Huge Discounts On Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఎంపిక చేసిన కార్ల మీద భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం కార్ల ధరలు తగ్గాయి. అయితే ఈ డిస్కౌంట్ ఎన్ని రోజులు ఉంటుందంటే?

కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. భారీ డిస్కౌంట్ ప్రకటించిన టాటా, మహీంద్రా కంపెనీలు

దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఎస్యూవీ కార్లపై భారీ డిస్కౌంట్ ని ప్రకటించాయి. ఇప్పటికే ఈ కంపెనీలు వివిధ మోడల్స్ పై డిస్కౌంట్లు ప్రకటించాయి. తాజాగా మరోసారి డిస్కౌంట్ ప్రకటించాయి. మహీంద్రా కంపెనీ తన ఎక్స్ యూవీ 700 కారుని లాంఛ్ చేసి మూడేళ్లు అయిన సందర్భంగా ఏ7 సిరీస్ కార్ల ధరలను 2 లక్షల వరకూ తగ్గించింది. దీంతో 21.54 లక్షలుగా ఉన్న ఏఎక్స్ 7 సిరీస్ కారు ధర రూ. 19.49 లక్షలకు తగ్గింది. ఈ తగ్గించిన ధరలు నాలుగు నెలల పాటు అందుబాటులో ఉంటాయని మహీంద్రా కంపెనీ తెలిపింది. ఎక్స్ యూవీ కార్ల విక్రయాలు ఇప్పటికే 2 లక్షల మార్కుని అందుకున్నాయి. తాజా నిర్ణయంతో ఈ విక్రయాలు జోరందుకోనున్నాయి.

కాగా మరో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కూడా తమ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై 70 వేల రూపాయల వరకూ తగ్గింపును అందిస్తుంది. దీంతో పాటు అదనంగా లక్ష 40 వేల రూపాయల విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్యూవీ కార్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. టాటా హ్యారియర్, సఫారీ కార్లపై ధరలను తగ్గించింది. దీంతో ప్రస్తుతం టాటా హ్యారియర్ రూ. 14.99 లక్షలు, సఫారీ ధర రూ. 15.49 లక్షలుగా ఉన్నాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ కారుపై కూడా 1.3 లక్షల రూపాయల వరకూ ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. టాటా పంచ్ ఈవీపై 30 వేల రూపాయల వరకూ ప్రయోజనాలను అందిస్తున్నట్లు టాటా మోటార్స్ సంస్థ తెలిపింది.

అయితే దేశీయ ఆటోమొబైల్ రంగంలో స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలన్నీ భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. జూన్ నెల రిటైల్ సేల్స్ లో కేవలం 0.73 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల విక్రయాలు ఆశించినంతగా లేవు. దీంతో ఇన్వెంటరీ పేరుకుపోతుంది. 62 నుంచి 67 రోజుల గరిష్ఠానికి చేరుకుంది. అందుకే ఆయా కార్ల తయారీ కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీని వల్ల డిమాండ్ పెరిగి మళ్ళీ కార్ల విక్రయాలు ఊపందుకుంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. కాగా యూపీ ప్రభుత్వం.. హైబ్రిడ్ కార్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేసిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి