iDreamPost
android-app
ios-app

Tata Curvv EV: మార్కెట్లోకి టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కార్! అదిరిపోయిన ఫీచర్స్!

  • Published Aug 21, 2024 | 5:30 AM Updated Updated Aug 21, 2024 | 7:06 AM

Tata Curvv EV: టాటా కార్లకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగిపోతుంది.

Tata Curvv EV: టాటా కార్లకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగిపోతుంది.

Tata Curvv EV: మార్కెట్లోకి టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కార్! అదిరిపోయిన ఫీచర్స్!

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. తన కార్లతో దశాబ్దాల నుంచి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సేఫ్టీ పరంగా ఫీచర్స్ పరంగా టాటా మోటార్స్ వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇప్పటికే ఎన్నో సూపర్ మోడల్స్ ని తీసుకొచ్చింది. ఇక తాజాగా టాటా కంపెనీ నుంచి గత కొంతకాలంగా ఊరిస్తున్న సూపర్ ఎలక్ట్రిక్‌ కారు రానే వచ్చేసింది. టాటా కర్వ్ కార్ విడుదల అయ్యింది. ఈ కారు ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కార్ ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

ఈ సూపర్ కార్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 55 kWh, 45 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇవే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌లు. 45 kWh వేరియంట్‌ 502 కిలోమీటర్లు, 55 kWh వేరియంట్‌ 585 కిలోమీటర్లు రేంజ్‌ను ఇస్తుంది. ఈ ఈవీ 1.2C ఛార్జింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ కార్ కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 150 కిమీల రేంజ్‌ వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 123 kWh మోటార్ ఉంటుంది. దాంతో కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 స్పీడ్ తో ఈ కార్ దూసుకుపోగలదు. ఇంకా అంతే కాకుండా ఇది గంటకు 160 కి.మీ టాప్‌ స్పీడ్‌తో ప్రయాణించగలదు. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్స్‌, లెవెల్‌ 2 ఏడీఏఎస్‌, ఆటో హోల్డ్‌ వంటి సూపర్ సేఫ్టీ ఫీచర్లని ఫిక్స్ చేశారు.

సాధారణంగా ఈవీ కార్లు సౌండ్‌ చేయకుండా ప్రయాణిస్తాయి. అందువల్ల కొన్ని సార్లు పాదచారులకు యాక్సిడెంట్స్ జరగవచ్చు. అలా జరగకుండా స్పెషల్ సౌండింగ్‌ సిస్టమ్‌ను ఈ కారులో ఫిక్స్ చేశారు. అలాగే ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, టచ్ క్లైమేట్ కంట్రోల్‌తో డాష్‌బోర్డ్‌ ఉంటుంది. 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌ ఉంటుంది. ఇక లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ ఇంకా 320W JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ వస్తాయి. ఈ కారులో 500 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉంది. దీనికి బీఎన్‌సీఏపీ 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కార్ల ధరల విషయానికి వస్తే.. రూ.17.49 లక్షల నుంచి 21.99 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు బుకింగ్స్ ని ఆగస్టు 12న ఓపెన్ చేశారు.