iDreamPost
android-app
ios-app

TATA నుంచి నానో EV.. సింగిల్ ఛార్జ్ తో 200KM!.. ధర ఎంతంటే?

  • Published Jul 11, 2024 | 10:13 PM Updated Updated Jul 11, 2024 | 10:13 PM

TATA Nano EV: దిగ్గజ కార్ల తయారీ సంస్థ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇది వరకు నానో కార్లను ప్రవేశ పెట్టగా ఇప్పుడు ఎలక్ట్రిక్ గా మార్చి రీ లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నది.

TATA Nano EV: దిగ్గజ కార్ల తయారీ సంస్థ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇది వరకు నానో కార్లను ప్రవేశ పెట్టగా ఇప్పుడు ఎలక్ట్రిక్ గా మార్చి రీ లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నది.

TATA నుంచి నానో EV.. సింగిల్ ఛార్జ్ తో 200KM!.. ధర ఎంతంటే?

చాలా మంది సొంత కారు ఉండాలని భావిస్తుంటారు. అయితే కార్ల ధరలు మాత్రం లక్షల్లో ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా నానో కారును తీసుకొచ్చింది. టాటా తీసుకొచ్చిన ఈ బుల్లి కారు ఆటో మొబైల్ ఇండస్ట్రీలో పెనుసంచలనాన్ని సృష్టించింది. కేవలం లక్ష రూపాయలకే నానో కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే నానో కారు మార్కెట్ లో ఆదరణ పొందలేక పోయింది. దీంతో కంపెనీ వీటి ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుండడంతో మళ్లీ నానో కారును ఎలక్ట్రిక్ గా మార్చి రీలాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. దీని ధర ఎంత ఉండనుందంటే?

టాటా నుంచి విడుదలయ్యే కార్లకు కస్టమర్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. క్వాలిటీ, ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉండడంతో టాటా కంపెనీ కార్లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే నానో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది చివరినాటికి నానో కారు రోడెక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నానో కారుకు సంబంధించిన ధర, ఫీచర్లు ఇవే అంటూ నెట్టింటా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

వార్తాకథనాల ప్రకారం ఈ టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఫీఛర్ల విషయానికి వస్తే.. ఈ కార్ కి 17 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 200 నుంచి 220 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని తెలుస్తున్నది. 2 ఎయిర్ బ్యాగ్స్, 3.3 కేడబ్య్లూ, ఏసీ చార్జర్, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రికల్ కారును లాంఛ్ చేస్తుంది టాటా. ఈ కార్ బేసిక్ ధర 5 లక్షల రూపాయలుగా ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని హైఎండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.