iDreamPost
android-app
ios-app

TATA EVలపై భారీ తగ్గింపు.. 1.2 లక్షల వరకు..!

Discounts On TATA EV Models: ప్రముఖ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ ఈవీలపై ధరలు తగ్గిస్తూ ప్రకటన చేసింది. సెలక్టెడ్ మోడల్స్ పై ఏకంగా రూ.1.2 లక్షలు తగ్గిస్తున్నట్లు తెలిపింది.

Discounts On TATA EV Models: ప్రముఖ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ ఈవీలపై ధరలు తగ్గిస్తూ ప్రకటన చేసింది. సెలక్టెడ్ మోడల్స్ పై ఏకంగా రూ.1.2 లక్షలు తగ్గిస్తున్నట్లు తెలిపింది.

TATA EVలపై భారీ తగ్గింపు.. 1.2 లక్షల వరకు..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలనే వినియోగిస్తున్నారు. ఎక్కడ చూసినా కార్లు, బైకులు ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉంటున్నాయి. అన్ని మహానగరాల్లో ఈవీల వాడకం బాగా పెరిగిపోయింది. ఈవీలను కొనుగోలు చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కంపెనీలు కూడా ప్రత్యేక డిస్కౌంట్స్, ధరల్లో తగ్గింపులను అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా కార్స్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వారి ఈవీ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఏకంగా రూ.1.2 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు వెల్లడించింది.

టాటా మోటార్స్ సంస్థ వినియోగదారులకు శుభవార్తను అందిచింది. తమ ఈవీ మోడల్స్ అయిన టాటా నెక్సన్.ఈవీ, టాటా టియాగో.ఈవీ మోడల్స్ పై రూ.1.2 లక్షల వరకు ధరల తగ్గింపును ప్రకటిచింది. అత్యధికంగా అమ్ముడయ్యే టాటా నెక్సన్ ఈవీపై రూ.1.2 లక్షలు ధర తగ్గిస్తున్నట్లు తెలియజేసింది. తాజా డిస్కౌంట్ తో టాటా నెక్సన్ ఈవీ ధర రూ.14.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అలాగే టాటా టియాగో మీద రూ.70 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ తాజా తగ్గింపుతో టాటా టియాగో మోడల్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ రెండు మోడల్స్ ధరలు తగ్గించడంతో టాటా పంచ్ మీద కూడా ఏమైనా డిస్కాంట్ ఉంటుందేమో అని అంతా భావించారు. కానీ, ఆ విషయంలో మాత్రం టాటా కంపెనీ వినియోగదారులను నిరాశ పరిచింది. ఎదుకంటే టాటా పంచ్ ఈవీ ధరను మాత్రం యధాతథంగా కొనసాగించింది. దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే టాటా ఈవీ మోడల్స్ ధరలు ఎందుకు తగ్గించారు అనే విషయంపై టాటా ప్యాసెంజర్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాస్తవ స్పందించారు. “ఈవీల ఖర్చులో ఎక్కువ శాతం బ్యాటరీలకే అవుతుంది. ఇటీవలకాలంలో బ్యాటరీల సెల్స్ ధరలు తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఆ బెనిఫిట్స్ ని వినియోగదారులకే అందివ్వాలి అనుకుంటున్నాం. ఈ విధంగా ఆ ప్రయోజనాలను కస్టమర్స్ కి బదిలీ చేస్తున్నాం. పైగా ఈవీల వినియోగం బాగా పెరిగింది. వాటిని మరింత అందుబాటులోకి తీసుకురావడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం” అంటూ వివేక్ శ్రీవాస్తవ ధరల తగ్గింపు వెనకున్న అసలు విషయాన్ని వెల్లడించారు.

టాటా మోటార్స్ సంస్థ వారి సేల్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో విద్యుత్ వాహనాల సేల్స్ జోరుగా సాగుతున్నాయి అన్నారు. 2023లో మామూలు వాహనాల విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదు అయ్యిందన్నారు. కానీ, ఈవీల్లో మాత్రం ఏకంగా 90 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. అదే 2024 జనవరిలో అయితే వాటి విక్రయాలు ఏకంగా 100 శాతం పెరిగాయంటూ తెలిపారు. ఇంక ఓవరాల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో టాటా మోటార్స్ సంస్థ అగ్రస్థానంలో ఉంది. ఈవీ మార్కెట్ లో ఏకంగా 70 శాతం వాటాతో టాటా మోటార్స్ టాప్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ నిర్ణయం తర్వాత.. మిగిలిన కంపెనీలకు కొత్త తలనొప్పి మొదలైనట్లు అవుతోంది. ఎందుకంటే బ్యాటరీ సెల్స్ ధరలు తగ్గాయని టాటా కంపెనీ ధరలు తగ్గించింది. కానీ, మిగిలిన కంపెనీలు ఏవీ అలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి రాబోయో రోజుల్లో మిగిలిన కంపెనీలు కూడా ధరలు తగ్గించక తప్పేలా లేదు. మరి టాటా మోటార్స్ తమ ఈవీల ధరలు తగ్గించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.