iDreamPost
android-app
ios-app

మార్కెట్లో హై డిమాండ్ ఉన్న బడ్జెట్ కారుకి కొత్త వర్షన్స్.. తక్కువ ధరలోనే!

Altroz All New Racer Version Price And Specifications: ప్రముఖ కంపెనీకి చెందిన కారు నుంచి లేటెస్ట్ వర్షన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అంతేకాకుండా దాదాపుగా ఆ కారు లుక్స్ కూడా మారిపోయాయి అనే చెప్పాలి. అది కూడా ధర మాత్రం బడ్జెట్ లోనే ఉండటం మరో విశేషం.

Altroz All New Racer Version Price And Specifications: ప్రముఖ కంపెనీకి చెందిన కారు నుంచి లేటెస్ట్ వర్షన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అంతేకాకుండా దాదాపుగా ఆ కారు లుక్స్ కూడా మారిపోయాయి అనే చెప్పాలి. అది కూడా ధర మాత్రం బడ్జెట్ లోనే ఉండటం మరో విశేషం.

మార్కెట్లో హై డిమాండ్ ఉన్న బడ్జెట్ కారుకి కొత్త వర్షన్స్.. తక్కువ ధరలోనే!

కారు అనేది అందరికీ అవసరంగా మారిపోయింది. అందుకే ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కారు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో హై డిమాండ్ ఉండే ఒక బడ్జెట్ కారుకి కొత్త వర్షన్స్ వచ్చేశాయి. అంతేకాకుండా ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఫీచర్స్ తో మార్కెట్లో ఉన్న కార్లతో పోలిస్తే.. ఇదే తక్కువ ధరలో ఉండటం విశేషం. అంతేకాకుండా ఆ కంపెనీకి ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది. సేఫ్టీకి ఆ కంపెనీ పెట్టింది పేరు. అలాంటి కంపెనీ నుంచి లీడింగ్ మోడల్ కు న్యూ వర్షన్స్ తీసుకొచ్చి వినియోగదారులను సర్ ప్రైజ్ చేశారు.

ఇప్పుడు చెప్పుకుంటున్న కంపెనీ మరేదో కాదు టాటా. వారి కంపెనీకి చెంది అల్ట్రోజ్ లోనే కొత్త వర్షన్స్ తీసుకొచ్చారు. ఈ కారుకు ఇప్పటికే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. బాగా సేల్ అవుతున్న కారు కూడా. అందుకే కంపెనీ దీనిని మరింత మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు కొత్త వర్షన్స్ తీసుకొచ్చింది. ఈ టాటా అల్ట్రోజ్ ధర రూ.9.5 లక్షల ఎక్స్ షో రూమ్ నుంచి రూ.10.99 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది. సాధారణంగానే ఈ కారు లుక్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు డ్యూయల్ టోన్ కలర్స్ కూడా తీసుకురాగానే.. మరింత ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ కొత్త వేరియంట్స్ ని మీరు రూ.21 వేల టోకెన్ అమౌంట్ కట్టేసి బుక్ చేసుకోవచ్చు.

కొత్తగా వచ్చిన ఫీచర్స్:

ఈ ఆల్ న్యూ అల్ట్రోజ్ లో డ్యూయల్ కలర్స్ ప్రత్యేకగా ఆకర్షణగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా మొత్తం 3 డ్యూయల్ టోన్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అటామిక్ ఆరెంజ్, ప్యూర్ గ్రే, అవెన్యూ వైట్ కలర్స్ ని తీసుకొచ్చారు. వీటిపై బ్లాక్ కలర్ అండే వైట్ లైన్స్ వస్తాయి. రేసర్ బ్లాక్- అవుట్ బానెట్, రూఫ్ తో వస్తోంది. చూడటానికి రేసింగ్ కారు ఫీల్ ఇస్తుంది. ఇంక బానెట్, రూఫ్ మీద రెండు తెల్ల రంగు గీతలు వచ్చాయి. ఇందులో వచ్చిన కొత్త అలాయ్ వీల్స్ ఈ కారును మరింత స్పోర్టీ లుక్స్ లోకి మార్చేసింది. అలాగే ఫెండర్ మీద వచ్చిన రేసర్ బ్యాడ్జ్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఇంకో అడిషనల్ అట్రాక్షన్ ఏంటంటే.. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉంది. డ్యాష్ బోర్డులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్ అన్నీ ఉన్నాయి.

నెక్సన్ ఇంజిన్:

ఈ అల్ట్రోజ్ కారుని కొత్తగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో తీసుకొస్తున్నారు. ఈ ఇంజిన్ ను టాటా నెక్సన్ కారు నుంచి తీసుకున్నారు. ఇంక ఈ ఇంజిన్ విషయానికి వస్తే.. గరిష్టంగా 118 బీహెచ్ పీ/ 170 NM టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో మీకు ఆటోమేటిక్ ట్రాన్సషన్ లేకపోవడం చిన్న డ్రా బ్యాక్ అనే చెప్పాలి. ఇది మొత్తం 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఈ కారు ప్రధానం మార్కెట్ లో ఉన్న హ్యూండాయ్ ఐ20 ఎన్ లైన్ కు గట్టి పోటీ ఇస్తుంది. ధరల విషయంలో ఐ20 కంటే ఈ టాటా అల్ట్రోజ్ రేసర్ మోడల్ రూ.50 వేల వరకు తక్కువకే లభిస్తుంది.