iDreamPost
android-app
ios-app

స్విగ్గీ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్.. 9 రూపాయలకే అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు!

  • Published Jul 29, 2024 | 8:00 PM Updated Updated Jul 29, 2024 | 8:00 PM

Swiggy Offers One Membership Coupon For Just 9 Rupees Which Benefits Food, Instamart Unlimited Free Deliveries: స్విగ్గీ యాప్ లో ఫుడ్ లేదా నిత్యావసర సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. 599 రూపాయల మెంబర్ షిప్ కూపన్ ని కేవలం 9 రూపాయలకే పొందండి. ఈ కూపన్ తో ప్రతి నెలా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచిత డెలివరీలు పొందండి.

Swiggy Offers One Membership Coupon For Just 9 Rupees Which Benefits Food, Instamart Unlimited Free Deliveries: స్విగ్గీ యాప్ లో ఫుడ్ లేదా నిత్యావసర సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. 599 రూపాయల మెంబర్ షిప్ కూపన్ ని కేవలం 9 రూపాయలకే పొందండి. ఈ కూపన్ తో ప్రతి నెలా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచిత డెలివరీలు పొందండి.

స్విగ్గీ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్.. 9 రూపాయలకే అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు!

ఇప్పుడు అందరూ ఆన్ లైన్ షాపింగ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక.. అందులో యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేసుకునేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఫుడ్, నిత్యావసర సరుకులు కూడా ఆర్డర్ చేసుకునేవారు ఎక్కువయ్యారు. బయటకు వెళ్లి తెచ్చుకునేవారు, తినేవారు ఎంతలా ఉన్నారో అంతకంటే ఎక్కువగా ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేసుకునేవారూ ఉన్నారు. అందుకే స్విగ్గీ, జొమాటో యాప్స్ అంత పాపులర్ అయ్యాయి. స్విగ్గీలో ఫుడ్ తో పాటు చికెన్, ఫిష్, పప్పులు, ఉప్పులు, పాలు, పెరుగు వంటివి కూడా ఆర్డర్ చేసుకునే వీలు ఉండడంతో స్విగ్గీ ఇన్స్టామార్ట్ కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే మీరు స్విగ్గీ యాప్ వాడుతున్నట్లైతే కనుక మీకు గుడ్ న్యూస్. 

స్విగ్గీ కంపెనీ తమ కస్టమర్ల కోసం వన్ బెనిఫిట్స్ పేరుతో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ తో మీరు నెల నెలా ఉచితంగా ఆర్డర్ పెట్టిన సరుకులు, ఫుడ్ పొందవచ్చు. అయితే దీని కోసం ప్రతి నెలా 599 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ ఆర్డర్స్ పెట్టేవారికి ఉపయోగపడుతుంది. మామూలుగా ఫుడ్ లేదా నిత్యావసర సరుకులు ఆర్డర్ పెట్టినప్పుడు డెలివరీ ఛార్జీలు అనేవి ఉంటాయి. వర్షాకాలంలో అయితే డెలివరీ ఛార్జీలు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది నెలలో కొన్నిసార్లు ఆర్డర్ పెడతారు. అది కూడా తక్కువ తక్కువ సరుకులు, తక్కువ ధర ఫుడ్ పెడతారు. కనీసం 500  రూపాయల పైన ఆర్డర్ పెడితేనే గానీ ఫ్రీ డెలివరీ వర్తించదు. అలాంటప్పుడు డెలివరీ ఛార్జీలు పడతాయి. అయితే మీకు ఎటువంటి డెలివరీ ఛార్జీలు పడకూడదు అంటే 9 రూపాయలతో ఈ ప్లాన్ కొనుక్కుంటే చాలు. నెలలో ఆర్డర్ పెట్టిన ప్రతిసారీ అపరిమితంగా ఫ్రీ డెలివరీ పొందవచ్చు.

Swiggy

అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అండ్ సేవింగ్స్ పేరుతో స్విగ్గీ వన్ మెంబర్ షిప్ ప్లాన్ ని అందిస్తుంది. ఇందులో భాగంగా 199 రూపాయల పై ఆర్డర్స్ మీద ఫ్రీ అన్ లిమిటెడ్ డెలివరీలు పొందవచ్చు. రెస్టారెంట్ ఫుడ్ గానీ ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేసే సరుకులు గానీ విలువ 199 రూపాయలు దాటితే డెలివరీ ఛార్జీలు ఉండవు. నెలలో ఎన్నిసార్లయినా సరే డెలివరీ ఛార్జీలు ఉండవు. వర్షాకాలం పడినా, రద్దీ వేళలు అయినా, సెలవులు అయినా సరే ఫ్రీగా డెలివరీ చేస్తారు. అంతేకాదు టాప్ రెస్టారెంట్స్ లో ఎక్స్ క్లూజివ్ ప్రీ బుక్ ఆఫర్స్ కింద డైన్ అవుట్ మీద 50 శాతం వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అలానే స్విగ్జీ జీనీ యాప్ మీద కూడా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్విగ్జీ జీనీ యాప్ ద్వారా పార్సిల్స్ పంపించుకోవడం, తెచ్చుకోవడం చేస్తుంటారు. 9 రూపాయల ప్లాన్ తో పలు రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్ స్టోర్స్, పీజ్జా బేకరీ వంటి వాటిలో 10 శాతం డిస్కౌంట్ కూడా  లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం.. ఇంకా వన్ మెంబర్ షిప్ కార్డు తీసుకోకపోతే కనుక వెంటనే 9 రూపాయలకు తీసేసుకోండి. లిమిటెడ్ టైం డిస్కౌంట్. అయిపోతే కష్టం మరలా.