iDreamPost
android-app
ios-app

Veero: మహీంద్రా నుంచి అదిరిపోయే కమర్షియల్ ట్రక్.. ఫీచర్లు సూపర్!

  • Published Sep 17, 2024 | 7:45 PM Updated Updated Sep 17, 2024 | 7:48 PM

Mahindra Veero: మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎల్​సీవీ సెగ్మెంట్​లో 3.5 టన్నుల విభాగంలో వీరో కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చింది.

Mahindra Veero: మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎల్​సీవీ సెగ్మెంట్​లో 3.5 టన్నుల విభాగంలో వీరో కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చింది.

Veero: మహీంద్రా నుంచి అదిరిపోయే కమర్షియల్ ట్రక్.. ఫీచర్లు సూపర్!

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మహీంద్రా కొత్త కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎల్​సీవీ సెగ్మెంట్​లో 3.5 టన్నుల విభాగంలో ఈ మహీంద్రా వీరో కమర్షియల్ వాహనాన్ని కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ వీరో లైట్‌ కమర్షియల్ ట్రక్ ని మహింద్రా మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఈ వాహనాన్ని డిజైన్‌ చేశారు. ఇక ఈ ట్రక్ ధర, ఫీచర్లు, ఇంజిన్ కెపాసిటీ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహీంద్రా కొత్తగా అభివృద్ధి చేసిన అర్బన్‌ ప్రాస్పర్‌ ప్లాట్‌ఫామ్‌పై (యూపీపీ) వీరోను డిజైన్‌ చేశారు. ఇది డీజిల్‌, సీఎన్‌జీ వేరియంట్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది 1,600 కేజీల పేలోడ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. వీరో లీటర్‌ డీజిల్‌కు 18.4 కిలోమీటర్ల మైలేజీని, కేజీ సీఎన్‌జీకి 19.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మహీంద్రా వీరోలో ఎన్నో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌, రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, పవర్‌ విండోస్‌ ఈ కొత్త వీరోలో ఉన్నాయి. అలాగే ఫ్లాట్ ఫోల్డ్ సీట్లు, డోర్ ఆర్మ్-రెస్ట్‌లు, మొబైల్ డాక్, పియానో ​​బ్లాక్ క్లస్టర్ బెజెల్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, హీటర్ అండ్ AC,ఫాస్ట్ ఛార్జింగ్ USB సీ-టైప్, 26.03 cm టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇంకా స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి సూపర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మహింద్రా వీరో 59.7 kW పవర్, 210 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇది 1.5-లీటర్ mDI డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంకా CNGతో లభించే ఈ ఇంజన్ 67.2 kW పవర్ ని, 210 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక మహీంద్రా వీరో ఎల్​సీవీ ధర విషయానికి వస్తే.. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. V2 CBC XL వేరియంట్‌ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. V6 SD XL వేరియంట్ ధర రూ.9.56 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. మంచి ఫీచర్లతో కమర్షియల్ ట్రక్ కావాలనుకునేవారికి ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. మరి మహింద్రా వీరోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.