iDreamPost
android-app
ios-app

చలికాలంలో సూపర్ బిజినెస్.. తక్కువ టైమ్ లో మంచి లాభాలు!

ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయలని కోరిక ఉంటుంది. అయితే బిజినేస్ చేసేందుకు అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ లు కూడా ఉన్నాయి. అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయలని కోరిక ఉంటుంది. అయితే బిజినేస్ చేసేందుకు అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ లు కూడా ఉన్నాయి. అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో సూపర్ బిజినెస్.. తక్కువ టైమ్ లో మంచి లాభాలు!

చాలామందికి బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ రంగంలోకి దిగుతుంటారు. ఇక వ్యాపారంలో అనేక రకాలు ఉంటాయి. కాలాన్ని బట్టి కూడా వ్యాపారాలు చేయవచ్చు. సీజన్ కి తగినట్లు వ్యాపారలను చేసుకున్నే వారు కూడా ఉన్నారు. అలానే చలికాలంలో చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఇవి కేవలం ఈ సీజన్‌ వరకే చేయవచ్చు. అయినప్పటికీ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సంపాదించవచ్చు.    మరి.. ఆ వ్యాపారాలు ఏమిటో తెలుసుకుందాం..

కాలాన్ని బట్టి వ్యాపారం చేయడవ వల్ల తక్కువ టైంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఒక వేళ నష్టం వచ్చినా కూడా అది మన ఆర్థిక స్థితిపై ప్రభావం చూపకుండా ఉంటుంది. అక్టోబర్ చివరి వారం నుంచి చలి ప్రారంభమైంది. నవంబర్ రెండో వారం.. అంటే దీపావళి పండుగ నుంచి చలి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో శీతకాలంలో వినియోగించే జర్కీన్స్‌కు, ఉలెన్‌ దుస్తువులకు మార్కెట్లో డిమాండ్‌ ఉంది. చలి నుంచి తట్టుకునేందుకు జనాలు స్వెటర్స్‌, జాకెట్స్‌, రగ్గులు, దుప్పట్లను ఎక్కువ వినియోగిస్తుంటారు. అందుకే చలికాలంలో వీటి కొనుగోల సంఖ్య భారీగా పెరుగుతోంది. చలికాలంలో వీటికి బాగా డిమాండ్‌ ఉంటుంది.

ఈ చలికాలాన్ని క్యాష్‌ చేసుకొని బాగా లాభాలు సంపాదించవచ్చు. కేవలం  ఈ శీతకాలం ఉండే 2 నుంచి 3 నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. అయితే ఈ బిజినెస్ ను రిటైల్‌గా కాకుండా హోల్‌సేల్‌గా చేయాలి. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందొచ్చు. పెద్ద సంఖ్యలో చలికాలంలో వినియోగించే దుస్తులను కొనుగోలు చేసి చిన్న చిన్న షాపులకు హోల్‌సేల్‌లో అమ్మితే మంచి లాభాలను పొందొచ్చు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ట్రెండింగ్‌లో ఉన్న ఉన్ని దుస్తువులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే మంచి. దీనివల్ల అన్ని వయసుల వారిని ఆకట్టుకోని అమ్మకాలు పెంచుకోవచ్చు.

ఈ రోజుల్లో ఈ కామర్స్‌ సైట్స్‌ కూడా వస్తువులను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తోంది. మీరు పట్టణంలో ఉంటే ఆన్‌లైన్‌లో ద్వారా కూడా ఈ దుస్తులను విక్రయించవచ్చు. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 2 నుంచి రూ. 3 లక్షలు ఉంటే సరిపోతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు దుస్తులు ఆర్డర్‌ చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు.. ఈ రంగంలో అనుభవం ఉన్నావారి సలహాలను తీసుకుంటే కూడా మంచిది.