వేసవిలో కూల్ ఆఫర్.. రూ. 400లకే మినీ కూలర్స్

Mini Cooler for Coming Summer: చలికాలం వెళ్లిపోతుంది. ఎండాకాలం ఎంటరైయ్యింది. వస్తూనే సెగలు కక్కుతుంది. పొద్దున్నే సూర్యుని ప్రతాపం చూపుతున్నాడు. ఇక ఇంట్లో ఉండే ఏసీలు, కూలర్స్, ప్రిడ్జ్ లకు పని మొదలైంది. అయితే కొత్తవి కొనాలనుకున్న వారికి బడ్జెట్ లో మినీ కూలర్స్ అందుబాటులోకి లభిస్తున్నాయి.

Mini Cooler for Coming Summer: చలికాలం వెళ్లిపోతుంది. ఎండాకాలం ఎంటరైయ్యింది. వస్తూనే సెగలు కక్కుతుంది. పొద్దున్నే సూర్యుని ప్రతాపం చూపుతున్నాడు. ఇక ఇంట్లో ఉండే ఏసీలు, కూలర్స్, ప్రిడ్జ్ లకు పని మొదలైంది. అయితే కొత్తవి కొనాలనుకున్న వారికి బడ్జెట్ లో మినీ కూలర్స్ అందుబాటులోకి లభిస్తున్నాయి.

చలికాలానికి గుడ్ బై చెప్పి.. సమ్మర్ ఎంటర్ అయిపోయింది. ఇలా వచ్చాడో లేదో.. భానుడు భగభగ మండిపోతున్నాడు. అప్పుడే ఉక్కపోత మొదలైంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. కాసేపు ఎండలో నించొని ఉంటే.. చెమటలు పట్టేస్తున్నాయి. పొద్దున్నంతా ఉద్యోగాలంటూ ఆఫీసుల్లో, వ్యాపారాలంటూ షాపుల్లో కష్టపడ్డ వారంతా.. సాయంత్రం అయ్యే సరికి చల్లగాలి కోసం తహ తహలాడిపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేక.. ఏసీలు, కూలర్లకు పని చెబుతున్నారు. అవి పనిచేయకపోతే..కొత్తవి కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో ఏసీ, కూలర్, ప్రిడ్జ్ వంటి ఎలక్ట్రికల్ రేట్స్ కూడా..సూర్యుడిలానే ప్రతాపం చూపుతుంటాయి. అలాంటి వారి కోసమే బడ్జెట్ ఫ్రెండ్లీ కూలర్స్ కూడా లభిస్తున్నాయి.

ఏసీ అంటే డబ్బుతో ముడిపడింది.. ముప్పై, నలభై దాటనిదే ఈ పరికరం రాదు. ఫైనాన్స్, ఇతర రూపాల్లో తీసుకుందామా అంటే.. పైసాతో కూడుకున్నది అలాగే.. సమ్మర్ అయిపోయాక.. మళ్లీ తిరిగి ఆఫ్ చేయాల్సిందే.. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏసీని కొనాలంటే కాస్త ఆలోచిస్తుంటారు. ఏసీలు కొనలేని వారంతా కూలర్ వైపు చూస్తుంటారు. సమ్మర్ వరకే కదా సరిపెట్టుకుందామనుకుంటూ ఉంటారు.  అలాంటి వారి కోసమే.. ఓ మిని, పోర్టబుల్ ఎయిర్ కూలర్స్ అందుబాటు ధరల్లో లభ్యమౌతున్నాయి. రూ. 300- 400 నుండే మినీ ఎయిర్ కూలర్స్ లభిస్తున్నాయి. వాటి కెపాసిటీని బట్టి వాటి ధరలు ఉండనున్నాయి. ప్రస్తుతం అయితే.. ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎండలు ముదిరితే.. మార్కెట్ డిమాండ్ ను బట్టి.. వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.

ఈ కామర్స్ సంస్థల్లో ప్రస్తుతం పోర్టబుల్ స్మాల్ ప్లాస్టిక్ ఎయిర్ కంటిషనర్ వాటర్ కూలర్స్ లభిస్తున్నాయి. కారు, ఇంట్లో, ఆఫీసుల్లో వినియోగించవచ్చు. ఈజీగా క్యారీ చేసుకునే విధంగా ఉంటాయి. ఒంటెల్ ప్లాస్టిక్ ఆర్టిక్ ఎయిర్ కూలర్.. మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 400గా చూపిస్తోంది. అలాగే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో డోమాక్ట్ మిని ఫ్యాన్, పోర్టబుల్ డ్యూయల్ బ్లేడ్లెస్ స్మాల్ ఎయిర్ కండిషనర్ వాటర్ ఎయిర్ కూలర్ కూడా.. ప్రస్తుతం రూ. 399కే ఎవిలబుల్‌గా ఉంది. దీని అసలు ధర రూ. 999 కాాగా 60 శాతం తగ్గింపుతో రూ.399కే కొనుగోలు చేయొచ్చు. దీనికి యుఎస్బీ, బ్యాటరీతో చార్జ్ చేసుకోవచ్చు. కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ధరల్లో లభ్యమౌతున్నాయి. ఇవి పెరిగే అవకాశాలున్నాయి. మరెందుకు ఆలస్యం.. గరం గరం ఎండలు ఉన్నప్పుడు కూల్ కూల్ అవుదామనుకుంటే.. ఈ మినీ, పోర్టబుల్ కూలర్స్ వినియోగించుకుని కాస్త ఉపశమనం పొందొచ్చు. మరి మీరు

ఈ డోమాక్ట్ మిని ఫ్యాన్, పోర్టబుల్ డ్యూయల్ బ్లేడ్లెస్ స్మాల్ ఎయిర్ కండిషనర్ వాటర్ ఎయిర్ కూలర్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments