iDreamPost
android-app
ios-app

కోట్ల సంపద.. కానీ 24 ఏళ్లలో ఒక్క కొత్త చీర కొనని సుధా మూర్తి.. ఎందుకో తెలుసా?

కోట్ల సంపద.. కానీ 24 ఏళ్లలో ఒక్క కొత్త చీర కొనని సుధా మూర్తి.. ఎందుకో తెలుసా?

కాసింత డబ్బు కనిపించగానే ఆడంబరాలకు పోయి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడే ఈ రోజుల్లో, వందల కోట్ల ఆస్తి ఉన్నా ఏమాత్రం గర్వం లేకుండా చాలా సాదాసీదాగా ఉంటూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆ మహిళ. సుమారు రూ. 700 కోట్ల ఆస్తులు కలిగి, ఏటా దాదాపు రూ. 300 కోట్లు సంపాదిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె. అంతటి ఆస్తిపాస్తులున్న సుధా మూర్తి గత 24 ఏళ్లలో ఒక్క కొత్త చీర కూడా కొనకుండా ఉన్నారంటే ఎవరైన నమ్మగలరా? కానీ అదే నిజం గడిచిన 24 ఏళ్లలో కొత్త చీర కొనలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇది తెలిసిన పలువురు షాక్ అవుతున్నారు.

చేతి నిండా డబ్బు ఉంటే ఆలోచనా విధానమే మారిపోతుంటుంది. ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన విల్లాలు, లగ్జరీ కార్లు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ధనవంతులు. విలువైన వస్తువులను కొనుగోలు చేసి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధా మూర్తి దీనికి పూర్తిగా భిన్నం. కోట్ల సంపద ఉన్నప్పటికీ ధనవంతుల మాదిరిగా కాకుండా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు సుధా మూర్తి. ఈ క్రమంలోనే గడిచిన 24 ఏళ్లలో ఒక్క కొత్త చీర కూడా కొనలేదని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీనికి గల కారణాన్ని తెలిపింది.

మామూలుగా మహిళలకు చీరలు, నగలు, ఆభరణాలపై మక్కువ ఎక్కువగానే ఉంటుంది. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే వందల కోట్ల ఆస్తి ఉన్నా సుధా మూర్తి మాత్రం 24 ఏళ్ల నుంచి కొత్త చీర కొనకుండా ఉన్నారు. దీనికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే.. “తాను పవిత్ర స్నానం కోసం కాశీని సందర్శించినప్పుడు, అక్కడ ఎక్కువగా ఆనందించే విషయాలను త్యజించాలని ఎవరో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. అప్పటి నుంచి నేను షాపింగ్, చీరలు కొనడం మానేశానని తెలిపింది. ఇప్పుడు నేను అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తానని” సుధా మూర్తి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.