P Krishna
దేశంలో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఒకప్పుడు చిన్న కూటీర పరిశ్రమలా తయారైనవే అంటారు. ఆ కంపెనీ యజమానులు కృషి, అంకితభావంతో అభివృద్దిలోకి తీసుకు వచ్చి నెంబర్ వన్ స్థానానికి ఎదిగారు.
దేశంలో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఒకప్పుడు చిన్న కూటీర పరిశ్రమలా తయారైనవే అంటారు. ఆ కంపెనీ యజమానులు కృషి, అంకితభావంతో అభివృద్దిలోకి తీసుకు వచ్చి నెంబర్ వన్ స్థానానికి ఎదిగారు.
P Krishna
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని చాలా మంది నిరూపించారు. ఆర్థిక కష్టాలు ఉన్నపుడు వాటిని ఎదించి సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్లిన వారు మంచి సక్సెస్ సాధించారు. వ్యాపార రంగంలో కొన్నిసార్లు భారీ నష్టాలు వస్తాయి.. తట్టుకోలేక చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు.. కానీ గెలుస్తామని నమ్మకంతో వ్యాపారాన్ని కొనసాగించి అద్భుత విజయం అందుకున్న వాళ్లు చాలా కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో ఉజాలా బ్లూ ప్రొడెక్ట్ అధినేత యంపీ రామచంద్రన్ ఒకరు. కృషి, అంకితభావంతో లక్షల మంది పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచారు. ఎంతోమందికి ఉపాది అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ఈ కంపెనీ అభివృద్ది కోసం ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
90వ దశకంలో ‘నాలుగు చుక్కలతో వెలుగు వచ్చింది..’ అంటూ టెలివిజన్ లో యాడ్ వచ్చేవి. ఒకప్పుడు మహిళలు ఎక్కువగా ఉజాలా నీల్ ని ఉపయోగించి బట్టలు ఉతికేవారు. ఉజాలా బ్లూ తయారు చేస్తున్న జ్యోతి లేబొరేటరీస్ లిమిటెడ్ వ్యవస్థాపకులు యంపీ రామచంద్రన్. జ్యోతి లేబొరేటరీస్ రెండు ప్రధాన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఒకటి ఉజాలా లిక్వడ్ క్లాత్ వైట్ నర్, మరొకటి మాక్సో మస్కిటో రిపెల్లెంట్. ఇది దేశీయ మార్కెట్ లో బాగా పాపులర్ అయిన ప్రొడక్ట్స్. ప్రస్తుతం ఈ కంపెనీ రూ.13,583 కోట్ల విలువ కలిగి ఉంది. ఇంత పాపులర్ కంపెనీ వ్యవస్థాపకులు ఒకప్పుడు రూ.5 వేల రూపాయలు అప్పు చేసి మరీ వ్యాపారాన్ని ప్రారంభించారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజం.. 5 వేల అప్పుతో ఇప్పుడు 14వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు యంపీ రామచంద్రన్.
యంపీ రామచంద్రన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాతా అకౌంటెంట్ గా పని ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం లో ఇమడలేక.. తానే సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని భావించాడు. తన ఆలోచనలతో కొన్ని విభిన్న ఉత్పత్తులను తయారు చేశారు. మొదట వంటలకు సంబంధించిన ప్రొడక్ట్స్ చేసినప్పటికీ.. విజయం సాధించలేకపోయారు. తర్వాత బట్టల వాషింగ్ కి సంబంధించిన ప్రొడక్ట్ తయారు చేయాలని భావించారు. 1983 లో రామచంద్రన్ కేరళాలోని త్రిస్సూర్ లో కొద్ది పాటి భూమిని తీసుకొని చిన్న కంపెనీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం తన సోదరుడి వద్ద రూ.5000 వరకు అప్పు తీసుకున్నాడు. కూతురు జ్యోతి పేరు మీద ‘జ్యోతి లేబోరేటరీస్’ అని పేరు పెట్టారు. అలా బట్టలు తెల్లగా చేసే ఉజాలా సుప్రీం లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్‌నర్ రూపొందించారు. 6 మంది మహిళా బృందంతో ప్రారంభించిన ఇంటింటికీ తిరిగుతూ విక్రయించారు. కొంతకాలం తర్వాత ఉజాలా సుప్రీమ్ భారతీయు ఇంటింటికీ చేరి మంచి ఆధరణ పొందింది. ఇందుకు యంపీ రామచంద్రన్ కృషి, అంకితభావం, పట్టుదలతో పాటు అనేక బ్రాండ్ల కంపెనీ సృష్టించడం జరిగింది. జ్యోతి లేబరోటరీస్ మార్కెట్ క్యాప్టల్ రూ.135.83 బిలియన్లు, అంటే రూ.13,583 కోట్లు అన్నమాట. ప్రస్తుతం రామచంద్రన్ దేశంలో గొప్ప పారిశ్రామికవేత్తగా స్థానం సంపాదించారు.