iDreamPost
android-app
ios-app

ఖాతాదారులకు ఊహించని షాకిచ్చిన SBI బ్యాంకు.. వారిపై మరింత భారం!

  • Published Jun 15, 2024 | 8:18 PM Updated Updated Jun 15, 2024 | 8:18 PM

Big Shock To SBI Customers: ఎస్బీఐ బ్యాంక్ ఇటీవలే క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎస్బీఐ ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో వారిపై మరింత భారం పడనుంది.

Big Shock To SBI Customers: ఎస్బీఐ బ్యాంక్ ఇటీవలే క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎస్బీఐ ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో వారిపై మరింత భారం పడనుంది.

ఖాతాదారులకు ఊహించని షాకిచ్చిన SBI బ్యాంకు.. వారిపై మరింత భారం!

ఖాతాదారులకు బ్యాంకులు అప్పుడప్పుడు శుభవార్తలు చెబుతుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, హోమ్ లోన్స్ పై వడ్డీ రేటు తగ్గించడం వంటివి ఖాతాదారులకు ఊరటనిస్తాయి. అయితే కొన్నిసార్లు బ్యాడ్ న్యూస్ కూడా చెప్తుంటాయి. హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు పెంచడం.. కొన్ని క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి ప్రయోజనాలను రద్దు చేయడం వంటి నిర్ణయాలు ఖాతాదారులకు షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇటీవలే ఎస్బీఐ బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని క్రెడిట్ కార్డులపై సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే వచ్చే రివార్డు పాయింట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

40కి పైగా క్రెడిట్ కార్డుల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారు ప్రభుత్వ లావాదేవీల విషయంలో వచ్చే రివార్డ్ పాయింట్లను కోల్పోనున్నారు. తాజాగా ఎస్బీఐ బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఖాతాదారులకు ఊహించని షాక్ ఎదురైంది. ఎస్బీఐ బ్యాంకులో హోమ్ లోన్, కార్ లోన్ వంటివి తీసుకున్నారా? అయితే మీకిది నిజంగా బ్యాడ్ న్యూసే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. తాజాగా స్టేట్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటుని (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగింది. ఈ కారణంగా ఎంసీఎల్ఆర్ తో లింక్ అయి ఉన్న లోన్స్ పై అదనపు భారం పడనుంది.

హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకున్న వ్యక్తులపై ఈఎంఐ భారం అధికంగా పడనుంది. వివిధ లోన్ టెన్యూర్లను బట్టి ఎంసీఎల్ఆర్ రేటు అనేది ఉంటుంది. ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరిగింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.65 శాతం పెరిగింది. ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగింది. మూడేళ్ళ ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది. హోమ్ లోన్స్, వాహన లోన్స్ సహా చాలా రిటైల్ లోన్స్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుతో లింక్ అయి ఉన్నాయి.