Arjun Suravaram
కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యాంకుల్లో అతిపెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). ఈ బ్యాంక్ కి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. తరచూ అనేక నిర్ణయాలు తీసుకునే ఈ బ్యాంకు తాాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యాంకుల్లో అతిపెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). ఈ బ్యాంక్ కి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. తరచూ అనేక నిర్ణయాలు తీసుకునే ఈ బ్యాంకు తాాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
Arjun Suravaram
సేవారంగంలో బ్యాంకింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సెక్టార్ నుంచి ఎన్నో సేవలు ప్రజలకు అందుతున్నాయి. నిత్యం ఉదయం లేచిన మొదలు, సాయంత్రం పడుకునే వరకు ఈ బ్యాంకింగ్ రంగంతో పనులు ఉంటాయి. అలానే వివిధ బ్యాంకులు తమ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల విషయం, వివిధ రకాల స్కీమ్ కి గురించి సమాచారం ఇస్తుంటారు. ఈ క్రమంలోనే వినియోగదారులకు బ్యాంకులు శుభవార్తలు కూడా చెబుతుంటాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యాంకుల్లో అతిపెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). ఈ బ్యాంక్ కి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. తరచూ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పే ఎస్బీఐ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఫిక్స్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రూ. 2 కోట్ల లోపు ఉండే రిటైల్ డిపాజిట్లు, అలానే రూ.2 కోట్ల పైన ఉండే బల్క్ డిపాజిట్లపై ఎంపిక చేసిన మెచ్యూరిటీ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్పులు చేసిన కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచే అమలులోకి వచ్చినట్లు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ లో పేర్కొంది. తాజాగా ఈ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో డిపాజిటర్లకు అదనపు లాభం చేకూరనుంది.
రూ.2 కోట్ల లోపు ఉండే డిపాజిట్ల విషయంలో ఎస్బీఐ తీసుకొచ్చిన కొత్త వడ్డీ రేట్లు ఇప్పుడు చూద్దాం… రూ.2 కోట్ల లోపు ఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇంట్రెస్ట్ ఛార్జీలను పెంచింది. అందులో కూడా 46-179 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ఉండే డిపాజిట్లపై అత్యధికంగా 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ పెంచింది. దీంతో సాధారణ ఖాతాదారులకు 4.75 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. అదే విధంగా వృద్ధులకు ఈ టెన్యూర్ పై 5.25 నుంచి 6 శాతానికి పెంచింది.
అలానే 180-210 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ పెంచింది. దీంతో సాధారణ వినియోగదారులకు 5.75 నుంచి 6 శాతానికి వడ్డీ రేటు పెరిగింది.
211 రోజుల నుంచి ఏడాది లోపు ఉండే డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను పెంచింది. నార్మల్ కస్టమర్లకు ఈ టెన్యూర్ డిపాజిట్లపై 6 నుంచి 6.25 శాతానికి పెరిగింది. ఇక సీనియర్ సిటిజన్లకు 6.50 నుంచి 6.75 శాతానికి పెరగనుంది.
ఇక రూ.2 కోట్ల పైన ఉండే బల్క్ డిపాజిట్లను చూస్తే.. 7-45 రోజుల టెన్యూర్ గల డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో సాధారణ కస్టమర్లకు 5 నుంచి 5.25 శాతానికి, సీనియర్ సిటిజన్ లకు 5.75 శాతం వడ్డీ రేటు అందనుంది. 46-179 రోజుల టెన్యూర్ పై 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.75 నుంచి 6.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.25 నుంచి 6.75 శాతానికి వడ్డీ రేటు పెరిగింది.
180-210 రోజుల టెన్యూర్ బల్క్ ఎఫ్‌డీ పై సాధారణ వ్యక్తులకు 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కొత్త వడ్డీ రేట్లు 6.60 శాతం, సీనియర్లకు 7.10 శాతం వడ్డీ రానుంది. 1 నుంచి 2 ఏళ్లలోపు డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు పెంచడంతో నార్మల్ కస్టమర్లకు వడ్డీ రేటు 6.80 నుంచి 7 శాతానికి పెరిగనుంది. అలానే 2 నుంచి 3ఏళ్ల టెన్యూర్ డిపాజిట్ల విషయంలో సాధారణ వినియోగదారులకు 25 బేసిస్ పాయింట్లు పెంచి.. 6.75 శాతం నుంచి 7 శాతానికి చేర్చింది. అలానే సీనియర్లకు కూడా 7.25 నుంచి 7.50 శాతానికి పెంచింది. మొత్తంగా ఎస్బీఐ.. తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.