iDreamPost
android-app
ios-app

సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ 1 నుంచి తగ్గనున్న గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

  • Published Aug 30, 2024 | 12:41 PM Updated Updated Aug 30, 2024 | 12:43 PM

Gas Cylinder, Petrol, Diesel Prices will fall: కేంద్రం సామాన్యులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి గ్యాస్‌, ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

Gas Cylinder, Petrol, Diesel Prices will fall: కేంద్రం సామాన్యులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి గ్యాస్‌, ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

  • Published Aug 30, 2024 | 12:41 PMUpdated Aug 30, 2024 | 12:43 PM
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ 1 నుంచి తగ్గనున్న గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

నెల ప్రారంభం అనగా మొదట తారీఖు వచ్చిందంటే చాలు కొన్ని ఆర్థికపరమైన అంశాల్లో మార్పులు కనిపిస్తాయి. బ్యాంకింగ్‌ పరంగా అయితే క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్స్‌కు సంబంధించిన రూల్స్‌ మారుతుంటాయి. ఇక ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం వంటివి చేస్తుంది. నెల మొదటి రోజున కచ్చితంగా మారే అంశం మాత్రం ఒకటి ఉంది. అదే గ్యాస్‌ సిలిండర్‌ ధర. నెల ప్రారంభం కాగానే ఫస్ట్‌ తారీఖునే చమురు కంపెనీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంటాయి. గతేడాది నుంచి డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేటు దిగి రావడమే కానీ పెరిగింది లేదు. కానీ కమర్షియల్‌ సిలిండర్‌ రేటు మాత్రం మార్పులకు గురవుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్‌ నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

సెప్టెంబర్‌ 1న గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు ఇంధన ధరలను తగ్గించాలని భావిస్తోందట కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50.. అలానే వాణిజ్య సిలిండర్ల ధర రూ.60 నుంచి రూ.70 వరకు తగ్గుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆగస్టులో బిజినెస్-గ్రేడ్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది, జూలైలో రూ.30 తగ్గింది. ఇక గతేడాది రాఖీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధరను 300 రూపాయలు తగ్గించింది. ఇప్పుడు దాని ధర మరో రూ.50 తగ్గితే, రూ.760 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. రాయితీని సద్వినియోగం చేసుకుంటే రూ.460కే సిలిండర్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. పీఎం ఉజ్వల యోజన ఇప్పటికే ఎల్‌పీజీ సిలిండర్‌లపై రూ.300 రాయితీ అందిస్తున్న సంగతి తెలిసిందే.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు

కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ రేట్లతో పాటుగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా తగ్గించనున్నట్లు సమాచారం. పెట్రోల్‌ లీటర్‌పై రూ.6, డీజిల్‌ లీటర్‌పై రూ.5 వరకు తగ్గనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతుం దేశంలో పెట్రోల్‌ ధర లీటర్‌ 100 రూపాయలు దాటగా.. డీజిల్‌ ధర రూ.90 దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు తక్కువగా ఉండటం వల్లే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది నిజమో కాదో తెలియాలంటే.. సెప్టెంబర్‌ 1 వరకు ఆగాలి. నిజంగానే కేంద్రం వీటి ధరలు తగ్గిస్తే మాత్రం సామాన్యులకు భారీ ఊరట లభించనుంది.