iDreamPost
android-app
ios-app

Skoda నుంచి బడ్జెట్ ధరలో లాంచ్ కానున్న కొత్త కార్!

  • Published Aug 28, 2024 | 1:00 AM Updated Updated Aug 28, 2024 | 1:00 AM

Skoda Kylaq: స్కోడా కార్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కార్లు మంచి ఫీచర్లని అందిస్తాయి. స్కోడా నుంచి త్వరలో కొత్త కార్ లాంచ్ కాబోతుంది.

Skoda Kylaq: స్కోడా కార్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కార్లు మంచి ఫీచర్లని అందిస్తాయి. స్కోడా నుంచి త్వరలో కొత్త కార్ లాంచ్ కాబోతుంది.

Skoda నుంచి బడ్జెట్ ధరలో లాంచ్ కానున్న కొత్త కార్!

స్కోడా కార్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. ఎందుకంటే ఈ కార్లు వినియోగాదారులకు మంచి ఫీచర్లని అందిస్తాయి. అంతేగాక ఇవి సేఫ్టీ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అందుకే చాలా మంది కూడా వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి వచ్చిన స్కోడా స్లేవియా, కొడియాక్‌, కుషాక్‌ కార్లు ఇండియన్ మార్కెట్లో చలామణి అవుతున్నాయి. ఈ కార్లు ఇన్నోవేటివ్ డిజైన్ ఇంకా  ఆకర్షణీయమైన ఫీచర్లని కలిగి ఉన్నాయి. అందుకే చాలా మంది వీటిని ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈమధ్యనే స్కోడా కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రకటించింది. కైలాక్ (Kylaq) అనే పేరుతో ఈ కార్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఇది కూడా బడ్జెట్ ధరకే వస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఈ కారుని టెస్ట్‌డ్రైవ్‌ చేశారు. అప్పుడు ఈ కార్ స్పై ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఈ కొత్త స్కోడా కైలాక్ కార్ కి  స్ప్లిట్ హెడ్ లైట్లు, LED DRLs, ఎల్-షేప్ అల్లాయ్ వీల్స్ లాగానే LED టెయిల్లైట్లు ఉంటాయి. ఈ కారులో 1-లీటర్ TSi టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 115ps మాక్సిమం పవర్ ని ఇస్తుంది. ఇంకా 178 nm మాక్సిమం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ కార్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ కారులో 5 మంది దాకా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఈ కార్ ఇంకా అప్డేటెడ్  ఫీచర్లతో రానుంది. ఈ కార్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో వస్తుంది. అంతేగాకా ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఈ కొత్త కార్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుందని సమాచారం తెలుస్తుంది. 

సేఫ్టీ విషయానికి వస్తే..  ఇందులో 6 ఎయిర్‌ బ్యాగులు ఉంటాయి. ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీల కెమెరా వంటి ఫీచర్స్ ఈ కారులో ఉంటాయి. ఇక ఈ కారు 2025 ఫిబ్రవరిలో షోరూమ్‌ల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలని కంపెనీ ఈ ఏడాది చివరికల్లా వెల్లడించనుంది. 2025 జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఈ కార్ అధికారిక ధరను ప్రకటిస్తారని సమాచారం. అయితే ఈ కార్ అందుబాటు ధరలోనే ఉంటుందని సమాచారం తెలుస్తుంది. దాదాపు  8 ల్లక్షల రేంజిలో ఈ కార్ ధర ఉంటుందట. మరి చూడాలి ఈ కార్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో..