iDreamPost
android-app
ios-app

FD చేసే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు సవరించిన బ్యాంకు!

నేటికాలంలో డబ్బులకు సంబంధించిన ప్రతి విషయంలో బ్యాంకులతో అవసరం ఉంటుంది. అదే విధంగా బ్యాంకులు సైతం కస్టమర్లకు అనేక సేవలు అందిస్తుంటాయి. తరచూ డిపాజిట్లపై ఆఫర్స్ కూడా ఇస్తుంటాయి. తాజాగా ఓ బ్యాంకు కూడా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

నేటికాలంలో డబ్బులకు సంబంధించిన ప్రతి విషయంలో బ్యాంకులతో అవసరం ఉంటుంది. అదే విధంగా బ్యాంకులు సైతం కస్టమర్లకు అనేక సేవలు అందిస్తుంటాయి. తరచూ డిపాజిట్లపై ఆఫర్స్ కూడా ఇస్తుంటాయి. తాజాగా ఓ బ్యాంకు కూడా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

FD చేసే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు సవరించిన బ్యాంకు!

నేటికాలంలో ప్రతి ఒక్కరి బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి. అలానే బ్యాంకులు కూడా వినియోగదారులకు అనేక రకాల సేవలు అందిస్తుంటాయి. పలు స్కీమ్స్, ఆఫర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల సవరణకు సంబంధించిన విషయంలో తరచూ కీలక విషయాలను బ్యాంకులు వెల్లడిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు గుడ్ న్యూస్ కూడా చెబుతుంటాయి. వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. తాజాగా ఓ బ్యాంకు కూడా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరి.. ఆ బ్యాంకు , ఆ వివరాలు ఏమిటోఇప్పుడు తెలుకుందాం..

మన దేశంలోఅనేక రకాలు బ్యాంకులు ఉన్నాయి. అన్నింటిపై రిజర్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ ఉంటుంది. అందులో ఏ బ్యాంకు కస్టమర్ గా అయిన మనం కొనసాగవచ్చు. అయితే  బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసే  అధిక వడ్డీ రేట్లు కోరుకునే వారు సాధారణంగహా ఎస్బీఐ వంటి పెద్ద కమర్షియల్ బ్యాంకులనే చూస్తారు.  అయితే అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేసే బ్యాంకుల వైపు చూడటం కూడా మంచింది.

అధిక వడ్డీ ఎందులో ఉందని చూసి డిపాజిట్ చేయడం ద్వారా మంచి లాభం పొందవచ్చు. ఇలా కేవలం పెద్ద బ్యాంకులే కాకుండా కొన్ని చిన్న బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. అందులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయి.  అలాంటి వాటిల్లో శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SGB)ఒకటి. ఈ బ్యాంకుల్లో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై ఇచ్చే వడ్డీ రేట్లు సవరించింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 24 తేదీ నుంచి అమల్లోకి  రానున్నట్లు అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సవరించిన వడ్డీ రేట్లు:

7- 14 రోజుల మెచ్యూరిటీ టెన్యూర్ గల ఎఫ్ డీ లకు 3.75 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. అదే విధంగా 15-29 రోజుల టెన్యూర్ గల డిపాజిట్లకు వడ్డీ రేటు 4 శాతం, నెల నుంచి మూడు నెలల(30-90 రోజుల) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ రేటు 4.50 శాతంగా పేర్కొంది. 91-180 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 6-12 నెలల డిపాజిట్లకు వడ్డీ రేటు 6.5 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల లోపు మెచూర్ అయ్యే డిపాజిట్లకు గరిష్ఠంగా 8.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

24 నెలల ఒక్క రోజు నుంచి 36 నెలల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ బ్యాంకు 8 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. మూడేళ్ల ఒక్క రోజు నుంచి ఐదేళ్ల లోపు డిపాజిట్లకు వడ్డీ రేటు 7 శాతం, 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లకు వడ్డీ రేటు 6.75 శాతంగా ఇస్తోంది. అదే విధంగా ఐదేళ్ల లోపు డిపాజిట్లకు వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఇక సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే.. వారి కూడా మంచి ఆఫర్ అందిస్తోంది. పైన పేర్కొన్న టెన్యూర్లన్నింటిపై వడ్డీ రేటు 0.50 శాతం అధికంగా ఉంటుంది.

60 ఏళ్లు దాటిన వారికి అత్యధికంగా ఏడాది నుంచి రెండేళ్ల లోపు టెన్యూర్ కు 8.60 శాతం వడ్డీ లభిస్తుంది. పిక్స్ డిపాజిట్లకు అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా బ్యాంకు నిపుణులు చెబుతుంటారు. దీనిలో ఎలాంటి రిస్క్ కు ఉండకపోగా, స్థిరమైన ఆదాయం పొంది సంపదను పెంచుకోవచ్చు. పూర్తి వివరాలకు ఎస్జీబీ బ్యాంకు వెబ్ సైట్ ను చూడండి. మరి.. ఈ బ్యాంకు అందిస్తున్న వడ్డీరేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.