P Venkatesh
P Venkatesh
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామిక వేత్త అయినటువంటి రతన్ టాటా గురించి తెలియని వ్యక్తి ఉండరేమో. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టాటా కంపెనీ ఉత్పత్తులపై భారతీయులకు ఎనలేని నమ్మకం. ఆ నమ్మకం వెనకాల రతన్ టాటా కృషి మరువలేనిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షనం రతన్ టాటా సొంతం. కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అండగా నిలవడంతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి పేదలకు సాయమందించారు రతన్ టాటా. కాగా రతన్ టాటా జీవితంలో ఓ ప్రత్యేకమైన మహిళ ఉంది. గతంలో చాలా సార్లు ఆ మహిళ గురించి రతన్ టాటా చాలా గొప్పగా చెప్పారు. ఇంతకీ ఆ మహిళ ఎవరంటే?
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జమ్‌షెడ్జీ టాటా(జమ్‌షెడ్జీ నుసర్వాన్ జీ టాటా) చే 1868 సంవత్సర లో స్థాపించబడిన భారతదేశంలోని పూర్వ కంపెనీ లలో ఒకటి. ఈ సంస్థ ఆరు ఖండాలలో 100కు పైగా దేశాల్లో కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న టాటా కంపెనీకి గతంలో ఓ మహిళ డైరెక్టర్‌గా పనిచేసిందన్న విషయం మీకు తెలుసా? ఆమె మరెవరో కాదు నవాజ్‌బాయి. 1925లో టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్‌గా ‘నవాజ్‌బాయి’ పనిచేసింది. ఆమె తన భర్త రతన్‌జీ టాటా మరణానంతరం కంపెనీకి సారథ్యం వహించి 1965లో తాను మరణించేంత వరకు టాటా కంపెనిని అగ్రపథంలో నడిపించింది.
కాగా కంపెనీ పురోగతిలో పాలుపంచుకోవడమే కాకుండా దాతృత్వ కార్యక్రమాలు కూడా చేపట్టింది. దీనిలో భాగంగానే నవాజ్‌బాయి 1928లో ఒక సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థను సర్ రతన్ టాటా ఇన్‌స్టిట్యూట్ (RTI) అని పిలుస్తారు. ఈ సంస్థ పేద మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, కుకరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు లాండ్రీ విభాగాలలో వారి స్వంత జీవనోపాధికి శిక్షణ అందిస్తుంది. లేడీ నవాజ్‌బాయి టాటా 1932లో సర్ రతన్ టాటా ట్రస్ట్ చైర్‌పర్సన్ అయ్యారు. కాగా నవాజ్‌బాయి టాటా స్వయంగా రతన్ టాటాకి గ్రాండ్ మదర్ అవుతారు. రతన్ టాటా నవాజ్‌బాయి గురించి, ఆమె గొప్పదనం గురించి చాలా కార్యక్రమాల్లో చెప్తుండే వారు.