iDreamPost
android-app
ios-app

ముకేశ్ అంబానీకి భారీ ఊరట.. ఆ వివాదానికి చెక్!

  • Author Soma Sekhar Published - 04:21 PM, Fri - 27 October 23

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొంతకాలంగా ఓ సమస్యతో సతమతమవుతూ వస్తున్నాడు. తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టారు. దీంతో అంబానీకి భారీ ఊరట లభించినట్లు అయ్యింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొంతకాలంగా ఓ సమస్యతో సతమతమవుతూ వస్తున్నాడు. తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టారు. దీంతో అంబానీకి భారీ ఊరట లభించినట్లు అయ్యింది.

  • Author Soma Sekhar Published - 04:21 PM, Fri - 27 October 23
ముకేశ్ అంబానీకి భారీ ఊరట.. ఆ వివాదానికి చెక్!

‘సీత కష్టాలు సీతకు.. పీత కష్టాలు పీతకు’ అన్న సామెత మనందరికి తెలిసిందే. అయితే ఇది డబ్బున్న వ్యక్తులకు వర్తించదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వారికున్న సమస్యలు వారికి ఉంటూనే ఉంటాయి. వ్యాపార దిగ్గజం, భారత్ లోనే అత్యంత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి కూడా సమస్యలు ఉన్నాయి. తాజాగా ఓ వివాదానికి సంబంధించి ముకేశ్ అంబానీ కొంతకాలంగా సతమతమవుతూ వస్తున్నాడు. తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టారు. దీంతో అంబానీకి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతకు భారీ ఊరట లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లోకి వారసత్వ ప్రణాళికకు అడ్డు తొలగిపోయింది. అంబానీ వారసులు అయిన ఇషా అంబానీ, ఆకాశ్, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియామకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. వీరిని రిలయన్స్ బోర్డులోకి తీసుకునేందుకు యాజమాన్యం ఆగస్టులోనే ఆమెదం తెలిపింది. తాజాగా రిలయన్స్ షేర్ హోల్డర్లు కూడా ఈ నిర్ణయానికి ఆమెదం తెలిపారు. దీంతో వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతారని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు తాజాగా సమాచారం అందించింది.

కాగా.. ఇప్పటికే దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇషా, ఆకాశ్ నియామకానికి షేర్ హోల్డర్లలో 93 శాతానికి పైగా ఆమోదం లభించింది. కానీ అనంత్ విషయంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది. 7 శాతం మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ 93 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో ఆర్ఐఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వీరి నియామకం అధికారికంగా పూర్తి అయినట్లేనని చెప్పొచ్చు. కాగా మరో 5 ఏళ్ల పాటు రిలయన్స్ ఇండస్ట్రీ ఛైర్మన్, ఎండీగా ముకేశ్ అంబానీనే కొనసాగుతారు.

ఇక తన వారసులను కంపెనీ బోర్డులోకి చేర్చేందుకు.. నీతా అంబానీ బోర్డు పదవికి రాజీనామా చేశారు. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ విభాగ బాధ్యతలు అప్పగించగా.. ఆకాశ్ కు జియో, అనంత్ కు రిలయన్స్ ఎనర్జీ బాధ్యతల్లో ఉన్నారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? అనంత్ నియామకానికి వ్యతిరేకంగా ఓటేయాలని బ్లూమ్ బెర్గ్ షేర్ హోల్డర్లకు సూచించింది. దానికి కారణం ఆకాశ్, ఇషాలతో పోలిస్తే.. అనంత్ కు తక్కువగా అనుభవం ఉండటమే కారణం. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ.. షేర్ హోల్డర్లు కూడా అంగీకారం తెలిపారు.