Arjun Suravaram
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అనేక రకాల సేవలు అందిస్తుంది. అలానే వివిధ బ్యాంకింగ్ అంశాలకు సంబంధించి కీలక సమచారం ఇస్తుంది. తాజాగా తన కస్టమర్లకు ఓ చక్కని అవకాశం కల్పించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అనేక రకాల సేవలు అందిస్తుంది. అలానే వివిధ బ్యాంకింగ్ అంశాలకు సంబంధించి కీలక సమచారం ఇస్తుంది. తాజాగా తన కస్టమర్లకు ఓ చక్కని అవకాశం కల్పించింది.
Arjun Suravaram
మన దేశంలో ఉన్న ప్రధాన రంగాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పని చేస్తూ.. ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నాయి. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు అనేక ఆఫర్లు, అవకాశాలు, వెసులుబాటులు కల్పిస్తుంటాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. అలానే తాజాగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వి రంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు చక్కని అవకాశాన్ని కల్పించింది. మరి.. ఆ అవకాశం ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి ప్రధానమైనది. ఇది తమ కస్టమర్లకు అనేక రకాల సేవలను అందిస్తుంది. ఫిక్స్ డిపాజిట్, హోమ్ లోన్స్, ఇతర ఈఎంఐల విషయంలో ఎస్బీఐ కీలక సమాచారం ఇస్తుంటుంది. అలానే ప్రభుత్వం అందించే పథకాల విషయంలోనూ ఎస్బీఐ బ్యాంకు తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కస్టమర్లకు తమ సేవలను సులభతరం అయ్యేలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు స్కీమ్స్ విషయంలో ఎస్బీఐ తమ కస్టమర్లకు చక్కని అవకాశం కల్పించింది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ( పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాలకు వినియోదారులు తామంతట తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని ప్రకటిచించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు స్కీమ్స్ కి ఎంతో ఆదరణ లభిస్తుంది. ఈ పథకాల్లో చేరేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు బ్యాంకుల చర్యలు తీసుకుంటున్నాయి. అలానే ఎస్బీఐ కూడా ఈ రెండు పథకాల విషయంలో తమ కస్టమర్లకు ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
ఇక ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన్ స్కీమ్ కింద బీమా చేసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే.. పాలసీదారుని కుటుంబానికి రూ.2 లక్షలు లభిస్తాయి. ఇది పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి ఎలాంటి మెచ్యూరిటీ లేదా సరెండర్ బెనిఫిస్ట్ అందించదు. అలానే మరో పథకం అయినా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా స్కీమ్. ఇది పాలసీదారుడికి ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా వైకల్యం కలిగినప్పుడు ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది. ఇది ప్రైమరీగా ఒక ఏడాదికే ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు. అర్హులైన పౌరులందరికీ ఈ రెండు బీమా కవరేజీలను విస్తరించడం, ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించడం అనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఈ డిజిటల్ ఎన్‌రోల్‌మెంట్ ఉంటుందని ఎస్బీఐ బ్యాంక్ పేర్కొంది.
వినియోగదారులు బ్రాంచ్ లేదా కస్టమర్ సర్వీస్ పాయింట్ కి వెళ్లకుండానే వారి సౌలభ్యం మేరకు ఆన్‌లైన్‌లోనే ఈ పథకాల కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేటప్పుడు వినియోదారులు తమ అకౌంట్ నంబర్, పుట్టిన తేదీని జన్ సురక్ష పోర్టల్‌లో నమోదు చేయాలి. అలాగే ఎస్బీఐ వారి ప్రాధాన్య బ్యాంక్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలను పూర్తి చేసి ప్రీమియం చెల్లించిన వెంటనే బీమా పత్రం జనరేట్ అవుతుంది. ఇలా సులభంగా ఆన్ లైన్ ద్వారా రెండు పథకాలను ఎస్బీఐ కస్టమర్లు నమోదు చేసుకోవచ్చు. మరి..ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.