Arjun Suravaram
SBI Hikes Lending Rates: ఎన్నో రకాల సేవలను అందిస్తూ.. తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలానే వివిధ రకాల పెట్టుబడి స్కీమ్ లను ఎస్బీఐ బ్యాంకు అందిస్తుంది. తాజాగా ఎస్బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది.
SBI Hikes Lending Rates: ఎన్నో రకాల సేవలను అందిస్తూ.. తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలానే వివిధ రకాల పెట్టుబడి స్కీమ్ లను ఎస్బీఐ బ్యాంకు అందిస్తుంది. తాజాగా ఎస్బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది.
Arjun Suravaram
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో ప్రధానమైనది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎన్నో రకలా సేవలను అందిస్తూ..కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అలానే వివిధ రకాల పెట్టుబడి స్కీమ్ లను ఎస్బీఐ బ్యాంకు అందిస్తుంది. ఇది ఇలా ఉంటే తరచూ వడ్డీ రేట్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ఎస్బీఐ బ్యాంకు ఇచ్చే సమచారం కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ఎస్బీఐ బ్యాంకు కొన్ని సార్లు కస్టమర్లకు గుడ్ న్యూస్ లు చెప్తుంటుంది. అలానే మరికొన్ని సందర్భాల్లో షాకింగ్ న్యూస్ అందిస్తుంది. తాజాగా వడ్డీ రేట్ల విషయంలో ఎస్బీఐ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో వినియోగదారుల,ఆటో రుణాలు మరింత భారం కానున్నాయి. ఇక సవరించిన వడ్డీ రేట్ల ధరలు ఆగస్టు 15 నుంచే అంటే నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఇక ఎస్బీఐ 2024 జూన్‌లో చివరిసారిగా ఎంసీఎల్ఆర్‌ను సవరించింది. ఇక తాజాగా సవరించిన రేట్ల ప్రకారం.. వివిధ కాలపరిమితులకు ఎంసీఎల్ఆర్ ను 8.20 శాతం నుంచి గరిష్టంగా 9.1 శాతంగా పెంచబడింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.20 శాతానికి చేరింది. ఇలానే నెల, మూడు నెలల టైమ్ పిరియడ్ లెండింగ్ రేటు ను 8.45 శాతం నుంచి 8.5 శాతానికి పెంచింది. అలానే 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతానికి, సంవత్సరం లెండింగ్ ధరను 8.85 నుంచి 8.95 శాతానికి పెంచింది. అదే విధంగా 2 ఏళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.05 శాతానికి, 3 ఏళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.1 శాతానికి పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఇక ఎంసీఎల్ ఆర్ గురించి చూసినట్లు అయితే..బ్యాంకులు డిపాజిట్ల సమీకరణకు చేసిన ఖర్చుల ఆధారంగా దీనిని నిర్ణయిస్టారు. ఒక రోజు నుంచి మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంటాయి. చాలా వరకు ఏడాది ఎంసీఎల్‌ఆర్‌కే అధిక రుణాలు అనుసంధానమై ఉంటాయి. ముఖ్యంగా ఆటో రుణాలు ఏడాది ఎంసీఎల్‌ఆర్‌కు, వ్యక్తిగత రుణాలు రెండేళ్ల ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమై ఉంటాయి. హోమ్ లోన్ జారీకి పరిగణనలోకి తీసుకునే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ లో మాత్రం ఎస్బీఐ ఎలాంటి మార్పూ చేయలేదు. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉన్నాయి. ముఖ్యంగా సిబిల్ స్కోరు ఆధారంగా వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. మరి.. ఎస్బీఐ సవరించిన వడ్డీ రేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.