P Venkatesh
ప్రముఖ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు ఆ ఖాతాదారులు ఉచితంగా రెండు లక్షలు పొందొచ్చు. ఇంతకీ ఏ ఖాతాదారులు? ఎలా పొందొచ్చంటే?
ప్రముఖ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు ఆ ఖాతాదారులు ఉచితంగా రెండు లక్షలు పొందొచ్చు. ఇంతకీ ఏ ఖాతాదారులు? ఎలా పొందొచ్చంటే?
P Venkatesh
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల కోసం అదిరిపోయే స్కీమ్స్ ను తీసుకొస్తుంది. పెట్టుబడి పెట్టేవారికి ఫిక్స్ డ్ డిపాజిట్లపై మంచి వడ్డీరేటును అందిస్తున్నది. ఇన్వెస్ట్ చేసేవారికి మంచి రాబడినిచ్చే పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ క్రమంలో ఎస్బీఐ గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐలో ఆ ఖాతా ఉన్నవారికి ఉచితంగా రెండు లక్షలు పొందే ఛాన్స్ కల్పిస్తున్నది. దేశంలో ప్రతిఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో 2014లో ప్రధాని నరేంద్ర మోడీ జన్‌ధన్ ఖాతాలను ప్రజలు ఫ్రీగా తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ జన్ ధన్ ఖాతా ఉన్న వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ అందించింది. ఫ్రీగా 2 లక్షలు పొందొచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జన్ ధన్ ఖాతాదారులకు లక్ష వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందే సౌకర్యం ఉంది. అయితే ఈ ఖాతాలు కలిగిన కొంతమందికి మాత్రం ఇన్సూరెన్స్ బెనెఫిట్స్‌ని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అంటే వీరు ఫ్రీగా 2 లక్షలు పొందొచ్చన్నమాట. ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఇప్పుడు విదేశాల్లో రోడ్డు ప్రమాదం జరిగిన నామినీలకు కూడా వర్తింపజేసింది. మరి మీరు ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందాలనుకుంటే జన్ ధన్ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 2018 ఆగస్టు 28 తర్వాత ఎస్బీఐలో జన్ ధన్ అకౌంట్ ఉన్నవారు ఈ ప్రయోజనం పొందగలరు.
ఎస్బీఐ రూపే జన్ ధన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఈ ప్రయోజనం పొందగలరు. 2018 ఆగస్టు 28 కంటే ముందు జన్ ధన్ అకౌంట్ కలిగివున్న వారికి మాత్రం ఇన్సూరెన్స్ రూ.1 లక్ష మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీన్ని రెండు లక్షలక పెంచింది ఎస్బీఐ. ఈ బీమా ప్రయోజనాన్ని పొందేందుకు నామినీలు, అవసరమైన డాక్యూమెంట్స్ తో.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్ ను ఫిల్ చేసి ఎస్బీఐలో అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 90 రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఇన్సూరెన్స్ డబ్బు నామినీ అకౌంట్‌లో జమ అవుతుంది. జన్ ధన్ ఖాతాలల్లో మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సిన పనిలేదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మీరు ఖాతా నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.