Vinay Kola
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సెలెక్టడ్ లోన్లపై వడ్డీ రేట్లని సవరించింది. వాటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సెలెక్టడ్ లోన్లపై వడ్డీ రేట్లని సవరించింది. వాటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Vinay Kola
ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వారికి ఊరటనిచ్చింది. లోన్ వడ్డీ రేటును తగ్గించింది. సాధారణంగా అన్ని బ్యాంకులు కూడా ప్రతి నెలా లోన్లు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. సర్దుబాటు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన లోన్లు సర్ధుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని లోన్ల పైన రేట్లని సవరించలేదు. కేవలం సెలెక్టేడ్ టర్మ్ లోన్లపై మాత్రమే వడ్డీ రేట్లను మార్చింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మార్చిన వడ్డీ రేట్లను అక్టోబర్ 15, 2024 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇక ఇప్పుడు ఎస్‌బీఐలో వడ్డీ ఎంత పడుతుంది? మనం లోన్ ఈఎంఐ ఎంత కట్టాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు ఎస్‌బీఐలో ఎంసీఎల్ఆర్ (MCLR) వడ్డీ రేట్లనేవీ 8.20 శాతం నుంచి 9.10 శాతం మధ్య ఉన్నాయి. నెల రోజుల MCLR రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.20 శాతానికి చేరింది. 3 నెలల MCLR రేటు 8.50 శాతం, 6 నెలల MCLR రేటు 8.85 శాతానికి మార్చబడింది. ఇక కస్టమర్ లోన్ లకు లింక్ అయ్యే ఏడాది టెన్యూర్ MCLR రేటులో మాత్రం ఎలాంటి మార్పుని చేయలేదు. దీనిని 8.95 శాతంగానే ఉంచింది. ఇక రెండేళ్ల MCLR రేటు 9.05 శాతం, మూడేళ్ల MCLR రేటు 9.10 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే సంవత్సరం MCLR రేటు 8.95 శాతంగానే ఉంది. దీనిపై ఎస్బిఐ 20 బేసిస్ పాయింట్లు ఎక్స్ట్రా గా యాడ్ చేసి లోన్ లపై వసూలు చేస్తుంటుంది. అంటే దీని ప్రకారం మినిమమ్ ఇంట్రెస్ట్ రేట్ 9.15 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఆటో లోన్ పై 9.15 శాతం నుంచి 10.10 శాతం దాకా వడ్డీని చార్జ్ చేస్తుంది. క్రెడిట్ హిస్టరీ మంచిగా ఉండి, బ్యాంకుతో మంచి రేలేషన్ కలిగి ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటుకే SBI లోన్ ఇస్తుంటుంది.
లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు అనుమతించే మినిమం రేటుని MCLR అని అంటారు. దీనిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసైడ్ చేస్తుంది. అలాగే లోన్ తీసుకునే వారికి తాము సెలెక్ట్ చేసుకున్న లోన్ టెన్యూర్ ప్రకారం MCLRని బ్యాంకులు లెక్కిస్తాయి. ఎస్‌బీఐ నుంచి మీరు ఒక రూ.10 లక్షల లోన్ తీసుకున్నారు అనుకుందాం. దానికి 5 ఏళ్ల పాటు లోన్ టెన్యూర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు మీకు బ్యాంకు 9.50 శాతం, 10 శాతం వడ్డీ రేట్లపై లోన్ ఇస్తే.. మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుందో ఆన్‌లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. సపోజ్ 9.50 శాతం వడ్డీ అనుకుంటే నెలకు ఈఎంఐ 21 వేలు కట్టాలసి ఉంటుంది. టోటల్ గా మీరు 2.60 లక్షల వడ్డీని కట్టాల్సి వస్తుంది. అదే మీకు 10 శాతం వడ్డీ రేటుతో లోన్ వస్తే అప్పుడు నెలకు 21, 250 రూపాయల వరకు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అప్పుడు మీరు టోటల్ గా కట్టే వడ్డీ 2.74 లక్షలపైన ఉంటుంది. మీకు అప్లై అయ్యే వడ్డీ రేటు, మీరు తీసుకునే టెన్యూర్ ప్రకారం మీ ఈఎంఐ ఉంటుంది. ఇది సంగతి. ఇక ఎస్బిఐ తన లోన్లపై తాజాగా సవరించిన వడ్డీ రేట్ల గురించి మీరెమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.