iDreamPost
android-app
ios-app

50 లక్షల హోమ్ లోన్‌పై 19 లక్షలు ఆదా అవ్వాలంటే ఇలా చేయండి!

  • Published Jun 08, 2024 | 4:21 PM Updated Updated Jun 08, 2024 | 4:38 PM

Save 19 Lakhs On Home Loan: హోమ్ లోన్ తీసుకోవడమే పెద్ద పాపం అని అనుకుంటారు. ఇక ఏళ్ల తరబడి ఈఎంఐ కట్టడం అంతకంటే మహా పాపం అని అనుకుంటారు. ఎందుకంటే తీసుకున్న లోన్ మీద రెండింతలు డబ్బు కడుతున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఈ తప్పు చేస్తే అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

Save 19 Lakhs On Home Loan: హోమ్ లోన్ తీసుకోవడమే పెద్ద పాపం అని అనుకుంటారు. ఇక ఏళ్ల తరబడి ఈఎంఐ కట్టడం అంతకంటే మహా పాపం అని అనుకుంటారు. ఎందుకంటే తీసుకున్న లోన్ మీద రెండింతలు డబ్బు కడుతున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఈ తప్పు చేస్తే అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

50 లక్షల హోమ్ లోన్‌పై 19 లక్షలు ఆదా అవ్వాలంటే ఇలా చేయండి!

హోమ్ లోన్ తీసుకోవడం ముఖ్యం కాదు. ఎంత తక్కువ వడ్డీ పడుతుందో కూడా చూసుకోవాలి. ఎందుకంటే తీసుకునే లోన్ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ అంత ఉంటే.. లోన్ పీరియడ్ ముగిసే సమయానికి కట్టేది మాత్రం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అంత ఉంటుంది. డబుల్, త్రిబుల్ కూడా అయిపోతుంది. అయితే ఇది కొంతమందికి. మరి కొంతమందికి అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏ లోన్ తీసుకోవాలన్నా ఆ వ్యక్తికి సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. సిబిల్ స్కోర్ బాగుంటేనే లోన్స్ వస్తాయి. హోమ్ లోన్ రావాలన్నా అంతే. సిబిల్ స్కోర్ ఘోరంగా ఉంటే లోన్ ఇవ్వమని ఖరాకండిగా చెప్పేస్తారు. కొంచెం తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం.. లోన్ వస్తుంది. కానీ వడ్డీ ఎక్కువగా ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దీని వల్ల లక్షల్లో డబ్బు అనేది ఆదా అవుతుంది. అదే స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ పెరిగిపోతుంది. దీని వల్ల లక్షల్లో అదనంగా భారం పడుతుంది.

వడ్డీ రేట్లు అనేవి ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. సిబిల్ స్కోర్ అనేది వడ్డీ రేటు మీద ప్రభావం చూపిస్తుంది. సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యమో ఈ ఉదాహరణ చూడండి మీకే తెలుస్తుంది. ఉదాహరణకు మీరు ఇంటి కోసం 50 లక్షలు హోమ్ లోన్ కి అప్లై చేశారని అనుకుందాం. మీ సిబిల్ స్కోర్ 820 ఉంది అనుకుందాం. అప్పుడు 20 ఏళ్ల వ్యవధికి వార్షిక వడ్డీ అనేది 8.35 శాతం పడుతుంది. నెల ఈఎంఐ వచ్చేసి రూ. 42,918 పడుతుంది. లోన్ వ్యవధి ముగిసే సమయానికి మీరు మొత్తం కట్టే డబ్బు కోటి 3 లక్షలు. అంటే అసలు 50 లక్షలతో పాటు వడ్డీ 53 లక్షలు అవుతుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 600 కంటే తక్కువ ఉంటే అంటే 580 ఉందనుకుందాం. 50 లక్షల హోమ్ లోన్ మీద 10.75 శాతం వార్షిక వడ్డీ పడుతుంది. 20 ఏళ్ల పాటు నెలకు రూ. 50,761 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

లోన్ పీరియడ్ 20 ఏళ్లు అనుకుంటే అసలు, వడ్డీ కలిపి మీరు బ్యాంకుకి చెల్లించేది కోటి 21 లక్షలు. 50 లక్షలు అసలు అయితే.. వడ్డీ ఏకంగా 71 లక్షలు అవుతుంది. చూశారా సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల అదనంగా 18 లక్షలు కట్టాల్సి వస్తుంది. అదే మీకు 820 సిబిల్ స్కోర్ ఉంటే కనుక ఆ 18 లక్షలు మిగులుతాయి. అందుకే సిబిల్ స్కోర్ ని కరెక్ట్ గా మెయింటెయిన్ చేయాలి. క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలు టైంకి చెల్లించాలి. అలానే క్రెడిట్ కార్డు లిమిట్ ఉంది కదా అని మొత్తం వాడేయకూడదు. కొంత శాతం మేరకే వాడాలి. 30 శాతం కంటే ఎక్కువ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. అలానే ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం ఎంక్వైరీ చేసినా కూడా సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లోన్స్ అయినా, క్రెడిట్ కార్డులైనా వాటికవే వెతుక్కుంటే వస్తే మంచిది. అంటే ప్రీఅప్రూవల్ వస్తే బెటర్. మీకు మీరుగా ప్రయత్నిస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి దృష్టిలో పెట్టుకుంటే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. ఫ్యూచర్ లో తీసుకునే లోన్స్ మీద వడ్డీ రేటు తక్కువ పడుతుంది. దీని వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది.