iDreamPost
android-app
ios-app

శాంసంగ్ నుంచి కొత్త బ్యాటరీ! 9 నిమిషాల ఛార్జ్ చేస్తే 965 కి.మీ. రేంజ్!

  • Published Aug 04, 2024 | 12:31 PM Updated Updated Aug 04, 2024 | 12:31 PM

Samsung Introduced New Battery That Comes With 20 Years Life Time And Gives 965 KM Range And It Charged In 9 Mins: చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆలోచించడానికి కారణం.. రేంజ్, ఛార్జింగ్ సమయం. ఇదే ప్రస్తుత ప్రధాన సమస్య. తక్కువ సమయంలో ఛార్జింగ్ అయిపోయి.. ఎక్కువ రేంజ్ ఇస్తే వాహనదారులు మరో ఆలోచన లేకుండా ఈవీలను కొనుగోలు చేస్తారు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. అందుకే శాంసంగ్ కంపెనీ ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సరికొత్త బ్యాటరీని రూపొందించింది.

  • Published Aug 04, 2024 | 12:31 PMUpdated Aug 04, 2024 | 12:31 PM
శాంసంగ్ నుంచి కొత్త బ్యాటరీ! 9 నిమిషాల ఛార్జ్ చేస్తే 965 కి.మీ. రేంజ్!

పెరిగిపోతున్న పెట్రోల్ భారం వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఛార్జింగ్ సమయం వల్ల వెనక్కి తగ్గిపోతున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అవ్వాలంటే 4, 5 గంటల సమయం పడుతుండడం వల్ల చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. మరో కారణం రేంజ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనం అయితే బాగుంటుంది కదా కొనుక్కోవడానికి అని చాలా మంది ఆలోచన. మరీ తక్కువ రేంజ్ అయితే ఒక పక్క ట్రిప్ కే ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి రావాలంటే గంటల గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు దూర ప్రయాణాలు చేసినప్పుడు మధ్యలో ఛార్జింగ్ డౌన్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నట్టు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో లేవు. ఇన్ని సమస్యల కారణంగా చాలా మంది కొనగలిగే సామర్థ్యం ఉన్నా గానీ కొనడం లేదు.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాంసంగ్ కంపెనీ సరికొత్త బ్యాటరీని డిజైన్ చేసింది. కేవలం 9 నిమిషాల్లోనే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కేలా సరికొత్త బ్యాటరీని రూపొందించింది. మరో విశేషం ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 965 కి.మీ. రేంజ్ ని ఇస్తుంది. ఈ బ్యాటరీ లైఫ్ 20 ఏళ్ళు వస్తుండడం మరో విశేషం. ఈ బ్యాటరీని ఏ వాహనంలో అయినా ఫిక్స్ చేసుకునేలా శాంసంగ్ కంపెనీ దీన్ని రూపొందిస్తుంది. శాంసంగ్ కంపెనీ ఈ బ్యాటరీని కార్లు, బస్సులు ఇలా ఆయా వాహనాలకు తగ్గట్టు వివిధ సైజుల్లో తీసుకొస్తుంది. సాధారణ బ్యాటరీలతో పోలిస్తే రెట్టింపు కెపాసిటీ కలిగి ఉంటాయి. మిగతా బ్యాటరీలతో పోలిస్తే ఇది కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ అవుతుండడం విశేషం.

9 min charge 965 KM

డ్రైవర్ టిఫిన్ ముగించే సమయంలోపే ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. దీని వల్ల వాహనదారుల సమయం ఆదా అవుతుంది. ఎక్కువ దూరాలు ప్రయాణం చేసే వీలుంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కొనే వీలుంటుంది. దక్షిణ కొరియాలోని సియోల్ లో జరిగిన ఎస్ఎన్ఈ బ్యాటరీ డే 2024 ఎక్స్ పోలో భాగంగా శాంసంగ్ కంపెనీ పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యాటరీని టెస్టింగ్ లో భాగంగా పలు వాహనాల్లో ఫిక్స్ చేసింది. 2027 నాటికి భారీ సంఖ్యలో ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ కనుక ఈ బ్యాటరీలను తీసుకొస్తే కనుక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కువ రేంజ్ రావడమే కాకుండా.. ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది.