జూన్‌ 1 నుంచి RTO కొత్త రూల్స్‌.. ఆ పని చేస్తే రూ.25 వేలు ఫైన్‌

RTO New Rules: వాహనదారులకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. జూన్‌ 1 నుంచి కొత్త ఆర్టీఓ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. వీటిని తెలుసుకోకపోతే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ వివరాలు..

RTO New Rules: వాహనదారులకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. జూన్‌ 1 నుంచి కొత్త ఆర్టీఓ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. వీటిని తెలుసుకోకపోతే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ వివరాలు..

ఒకప్పుడు దేశంలో జనాలు ఎక్కడికి వెళ్లాలన్నా కాలి నడక, ఎడ్ల బండ్లు.. ఆ తర్వాత ప్రభుత్వ రవాణా సదుపాయాలు వాడుకునేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. మనిషి జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ప్రజా రవాణాతో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా వచ్చి చేరాయి. ఇక ఇప్పుడైతే వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో ఇంటికో వెహికల్‌ తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో వాహదారులకు ఆర్టీఓ అలర్ట్‌ జారీ చేసింది. జూన్‌ 1 నుంచి ఆర్టీఓ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటిని తెలుసుకోకపోతే.. వాహనదారులు భారీగా నష్టపోయే ఛాన్స్‌ ఉంది. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని నేరాలకు పాల్పడితే.. భారీ ఎత్తున జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ వివరాలు..

ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం ఆర్టీవో జూన్ 1, 2024 నుండి కొత్త వాహన నిబంధనలను అమలు చేయబోతుంది. కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి డ్రైవింగ్‌ ఇచ్చినా.. అతివేగంతో వాహనం నడిపినా.. రూ.25,000 జరిమానా విధించే అవకాశం ఉంది.

జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే రూల్స్‌ ఇవే..

  • వేగంగా వాహనం నడిపితే 1000-2000 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
  • మైనర్ వాహనం నడిపితే రూ.25,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
  • లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
  • హెల్మెట్ ధరించకుంటే రూ.100, సీటు బెల్ట్ పెట్టుకోకుంటే రూ.100 జరిమానా.
  • మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.
  • మీకు 25 ఏళ్ల వరకు లైసెన్స్‌ ఇవ్వరు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ మరింత సులభం..

కొత్త నిబంధనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ఇకపై ఆర్టీఓ ఆఫీసు వెళ్లకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం జూన్ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం.. ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులు.. ప్రభుత్వం గుర్తించిన ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌లో కూడా డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరు కావచ్చు. వారు డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి మీకు ఓ సర్టిఫికేట్‌ జారీ చేస్తారు. దాని ద్వారా మీరు ఆర్టీఓ ఆఫీసులో లైసెన్స్‌ పొందవచ్చు. అలానే ప్రైవేట్‌ డ్రైవింగ్‌ స్కూల్స్‌కు సంబంధించి కూడా ఆర్టీవీ కొత్త నిబంధనలు అమలు చేయనుంది.

Show comments