iDreamPost
android-app
ios-app

కోట్ల మంది ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. ఎట్టకేలకు భారత మార్కెట్లో..

  • Published Jul 17, 2024 | 8:01 PM Updated Updated Jul 17, 2024 | 8:01 PM

Royal Enfield Guerrilla 450 Specifications, Price Details: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే కొత్త బైక్స్ కోసం కొనేవాళ్ళు, కొనాలని కల కనేవాళ్ళు, కొనకపోయినా చూసి ఆస్వాదించేవాళ్ళు ఇలా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. కొత్తగా ఈ కంపెనీ నుంచి మరో బైక్ లాంఛ్ అయ్యింది. ధర ఎంత? స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు మీ కోసం.

Royal Enfield Guerrilla 450 Specifications, Price Details: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే కొత్త బైక్స్ కోసం కొనేవాళ్ళు, కొనాలని కల కనేవాళ్ళు, కొనకపోయినా చూసి ఆస్వాదించేవాళ్ళు ఇలా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. కొత్తగా ఈ కంపెనీ నుంచి మరో బైక్ లాంఛ్ అయ్యింది. ధర ఎంత? స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు మీ కోసం.

కోట్ల మంది ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. ఎట్టకేలకు భారత మార్కెట్లో..

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీన్నో స్టేటస్ సింబల్ గా భావిస్తారు. మిడిల్ క్లాస్ వారి నుంచి హై క్లాస్ పీపుల్ వరకూ అందరికీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద రైడ్ చేయాలని ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మోడల్స్ అన్నీ ఆదరణ పొందాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో కొత్త బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంత? ఎన్ని వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది? ఫీచర్స్ ఏంటి? వంటి వివరాలు మీ కోసం. 

రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 బైక్.. 452 సీసీ లిక్విడ్ కూలింగ్ సింగిల్ సిలిండర్ షెర్పా ఇంజిన్ తో వస్తుంది. 39.4 బీహెచ్పీ, 40 ఎన్ఎం పీక్ టార్క్ ని కలిగి ఉంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ ని ఇచ్చారు. ఇది అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్ ఆప్షన్ తో నడుస్తోంది. ఇందులో రెండు రైడ్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి పెర్ఫార్మెన్స్ మోడ్, రెండు ఎకో రైడ్ మోడ్. ఇది ఫ్లాష్, డ్యాష్, అనలాగ్ వేరియంట్స్ లో వస్తుంది. అయితే టాప్ (ఫ్లాష్) వేరియంట్ లో మాత్రమే 4 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. కానీ బేస్ (అనలాగ్) వేరియంట్ లో మాత్రం సింపుల్ డిజిటల్ అనలాగ్ డిస్ప్లే ఇచ్చారు. టాప్ మోడల్ గూగుల్ మ్యాప్స్ తో పని చేసేలా టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. అలానే ఇందులో బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. మ్యూజిక్ వినచ్చు, అలానే మెసేజ్ అలర్ట్ లు పొందవచ్చు.

రౌండ్ హెడ్ లాంప్, ముందు వెనుక స్ప్లిట్ సైడ్ ఇండికేటర్స్ తో వస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లుగా ఉంది. ఈ బైక్ ముందు వైపు 43 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు 140 ఎంఎం, లింకేజ్ టైప్ మోనోషాక్ తో వస్తుంది. అన్ని రకాల రోడ్ల మీద ప్రయాణించేలా సియట్ కంపెనీతో ప్రత్యేకంగా ట్యూబ్ లెస్ అలాయ్ వీల్స్ ని తయారు చేయించింది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ. అనలాగ్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 2.39 లక్షలు ఉండగా.. డ్యాష్ వేరియంట్ రూ. 2.49 లక్షలు, ఫ్లాష్ వేరియంట్ ధర రూ. 2.54 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది ఐదు రకాల కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. బ్రావా బ్లూ, ఎల్లో రిబ్బన్, ప్లాయా బ్లాక్, గోల్డ్ డిప్, స్మోక్ సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది. కలర్స్ ని బట్టి బైక్ ధర కూడా  మారుతుంది. ఇక ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ విక్రయాలు ఆగస్టు 1 నుంచి మొదలు కానున్నాయి.

  • ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • ఈ బైక్ స్పెసిఫికేషన్స్ తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.