Rolls Royce: రూ.10.50 కోట్ల ధరతో రోల్స్ రాయిస్ కొత్త కారు లాంచ్.. దీని ప్రత్యేకతలివే!

Rolls Royce: తాజాగా రోల్స్ రాయిస్ ఇండియన్ మార్కెట్‌లోకి కల్లినన్ సిరీస్-2 కారును లాంచ్ చేసింది. ఈ కార్ అప్డేటెడ్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉంది.

Rolls Royce: తాజాగా రోల్స్ రాయిస్ ఇండియన్ మార్కెట్‌లోకి కల్లినన్ సిరీస్-2 కారును లాంచ్ చేసింది. ఈ కార్ అప్డేటెడ్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉంది.

లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ రేంజే వేరు. అపార కుబేరులకు ఇది ఫేవరెట్ కార్. ఇండియాలో కూడా ఈ కార్ కొనుగోలు చేసే కుబేరులు ఉన్నారు. ఇక తాజాగా రోల్స్ రాయిస్ ఇండియన్ మార్కెట్‌లోకి మరో కొత్త కారను తీసుకొచ్చింది. కల్లినన్ సిరీస్-2 కారును లాంచ్ చేసింది. ఈ సూపర్ లగ్జరీ కార్ అప్డేటెడ్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉంది. రోల్స్ రాయిస్ కంపెనీ ఈ కారుని చెన్నైలో విడుదల చేసింది. ఇది వరల్డ్ లోనే ఫేమస్ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీల్లో ఒకటని కంపెనీ తెలిపింది. లగ్జరీ కార్ లవర్స్ ని ఈ కార్ కచ్చితంగా ఆకర్షిస్తోందట. స్పెషల్ ఫీచర్స్ కోరుకునే వారికి అనుగుణంగా దీన్ని తయారు చేశారట. సెప్టెంబర్ 27 నుంచి ఈ కార్ అందుబాటులో ఉంది. ఇక దీని ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2 ప్రారంభ ధర రూ.10.50 కోట్లు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఇందులో బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ సిరిసీ 2 అనే మోడల్ ఉంది. దాని ప్రారంభ ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కార్లో అదిరిపోయే ఇంటీరియర్ ఉంటుందట. ఈ కొత్త ఫీచర్లు తీసుకురావడంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాప్ ఎండ్ మోడల్ కన్నా రూ. 3.55 కోట్లు ధర ఎక్కువగా అవుతోందని కంపెనీ తెలిపింది. పాత మోడల్ కన్నా బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ. 4.05 కోట్లు ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీంతో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాస్ట్లీ ఎస్‌యూవీగా ఈ కారు నిలిచింది. మార్కెట్లో ఈ కారుని తలదన్నేవి ఏవి లేవు.

ఈ కార్ ఇంజన్ విషయానికి వస్తే.. దీంట్లో 6.75 లీటర్ల ట్విన్ టర్బోచార్జ్‌డ్ నీ12 ఇంజన్ ఉంటుంది. ఇది 571 హెచ్‌పీ పవర్, 850 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే బ్లాక్ బ్యాడ్జ్ కారులోని ఇంజన్ విషయానికి వస్తే.. ఇది 600 హెచ్‌పీ పవర్, 900 ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ కారులో 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది నాలుగు చక్రాలకు కూడా పవర్ ని సప్లై చేస్తుంది. ఇక ఈ రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2 కారు ముందు భాగం అయితే అదిరిపోయింది. దీన్ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ దీనికి ఫిక్స్ చేశారు. ఇంకా ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, వెనుక స్టెయిన్ లెస్ స్టీల్ స్కిడ్ ప్లేట్, రీడిజైన్ గ్రిల్ వంటి సూపర్ లగ్జరీ ఎలిమెంట్స్ ఈ సరికొత్త కారులో ఉన్నాయి. ఇక తాజాగా లాంచ్ అయిన ఈ రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2 లగ్జరీ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments