iDreamPost
android-app
ios-app

స్కూల్ టీచర్ నుంచి రోల్స్ రాయిస్ ఓనర్‌గా.. ఇది ఎలా సాధ్యమంటే?

  • Published Jul 13, 2024 | 9:04 PM Updated Updated Jul 13, 2024 | 9:04 PM

School Teacher To Rolls Royce Owner: ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. ఆ కలలో కారు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, జీవితంలో బాగా స్థిరపడాలని అనే కోరికలు ఉంటాయి. కలలకి, కోరికలకి చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడాలు లేవు. నిద్రలో వచ్చే కలలు ఫ్రీ కాబట్టి పెద్ద ఖర్చు ఉండదు. అయితే ఆ కలలను సాధించడం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, దాని కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఒక స్కూల్ టీచర్ కూడా తన కల కోసం కష్టపడ్డారు. తాను ఎప్పటికైనా రోల్స్ రాయిస్ కారులో తిరగాలి అని ఒక బలమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. అది ఎలా సాధ్యపడిందంటే?

School Teacher To Rolls Royce Owner: ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. ఆ కలలో కారు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, జీవితంలో బాగా స్థిరపడాలని అనే కోరికలు ఉంటాయి. కలలకి, కోరికలకి చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడాలు లేవు. నిద్రలో వచ్చే కలలు ఫ్రీ కాబట్టి పెద్ద ఖర్చు ఉండదు. అయితే ఆ కలలను సాధించడం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, దాని కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఒక స్కూల్ టీచర్ కూడా తన కల కోసం కష్టపడ్డారు. తాను ఎప్పటికైనా రోల్స్ రాయిస్ కారులో తిరగాలి అని ఒక బలమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. అది ఎలా సాధ్యపడిందంటే?

స్కూల్ టీచర్ నుంచి రోల్స్ రాయిస్ ఓనర్‌గా.. ఇది ఎలా సాధ్యమంటే?

ఒకప్పుడు కూలింగ్ వాటర్ తాగడం అతని కల. నేనెప్పుడు కూలింగ్ వాటర్ తాగుతానా అని తనను తాను ప్రశ్నించుకున్న వ్యక్తి. సాధారణ స్కూల్ టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ కొనుక్కుని తన కలను నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత మంచి ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత బెంజ్, జాగ్వార్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లను తన కలల గ్యారేజ్ లో పెట్టుకున్నారు. ఇవన్నీ స్కూల్ టీచర్ అయిన అతనికి ఎలా సాధ్యపడిందంటే?

సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం. ఆర్థిక దుస్ధితితో పోరాడేందుకు, యుద్ధం చేసేందుకు సోషల్ మీడియాని మించిన ఆయుధం లేదు. సోషల్ మీడియా ఎంతోమంది ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు. సోషల్ మీడియాలో వ్లాగ్స్, రీల్స్ వంటివి షేర్ చేస్తూ బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ స్కూల్ టీచర్ ఒకరు. ఈయన పేరు పీఆర్ సుందర్. స్కూల్ టీచర్ గా కెరీర్ ప్రారంభించి ఇండియా స్టాక్ మార్కెట్ అడ్వైసర్ గా మారారు. ఈయన చాలా పేదరికం నుంచి వచ్చారు. ఈయనది చెన్నై. చెన్నైలో పీజీ చేసిన తర్వాత గుజరాత్ లోని ఓ స్కూల్లో గణిత టీచర్ గా చేరారు. అక్కడ పరిచయమైన స్నేహితులతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి తెలుసుకున్నారు. 1987 నుంచి 1993 వరకూ గుజరాత్ లో పని చేశారు. ఆ తర్వాత సింగపూర్ లో టీచర్ గా అవకాశం వస్తే వెళ్లారు. 2005లో తిరిగి స్వదేశానికి వచ్చారు.

2007లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఎంట్రీ ఇచ్చారు. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ ద్వారా, స్టాక్  మార్కెట్ వ్యాపారం ద్వారా కోట్లు గడించారు. 30 కోట్ల విలువైన ఇంటిలో నివసిస్తున్నారు. ఆయనకు మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, జాగ్వార్ కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ కారుతో తన 45 ఏళ్ల కల నెరవేరిందని ఆ మధ్య ట్వీట్ చేశారు. రోల్స్ రాయిస్ కారు తన డ్రీమ్స్ లో ఒకటని.. దాన్ని కూడా కొంటున్నా అని అన్నారు. అన్నట్టుగానే ఇటీవల ఆయన రోల్స్ రాయిస్ కారుని కొనుగోలు చేశారు. ఇండియాలో కొంటే 14 కోట్లు అవుతుందని దుబాయ్ లో కొని ఇక్కడకి ట్రాన్స్ పోర్ట్ ద్వారా తెప్పించుకున్నారు. ఆయన కొన్నది రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు. దుబాయ్ లో 7 కోట్లకు కొన్నానని అన్నారు. ఆ కారుని ఇండియాకి తీసుకురావడానికి 7,8 లక్షల వరకూ ఖర్చు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. అలా స్కూల్ టీచర్ నుంచి రోల్స్ రాయిస్ కారు ఓనర్ గా ఎదిగారు.