iDreamPost
android-app
ios-app

అంబానీ కంటే ముందే అత్యంత ఖరీదైన ఆ కారు ఆ నటి సొంతం!

  • Published Nov 18, 2023 | 1:47 PM Updated Updated Nov 18, 2023 | 1:47 PM

ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ దగ్గర అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే, ఓ కారు విషయంలో మాత్రం ఆయన వెనకబడిపోయారు. రికార్డును మిస్‌ చేసుకున్నారు...

ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ దగ్గర అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే, ఓ కారు విషయంలో మాత్రం ఆయన వెనకబడిపోయారు. రికార్డును మిస్‌ చేసుకున్నారు...

  • Published Nov 18, 2023 | 1:47 PMUpdated Nov 18, 2023 | 1:47 PM
అంబానీ కంటే ముందే అత్యంత ఖరీదైన ఆ కారు ఆ నటి సొంతం!

ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీకి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంబానీ కుటుంబం ప్రపంచంలోనే టాప్‌ 5లో ఉంటుంది. అంబానీ ఫ్యామిలీ కావాలనుకుంటే లభించని లగ్జరీలు ఉండవు. భవనాలు, కార్లు, విమానాలు ఇలా దేనికీ వారికి కొదవు ఉండదు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. దేశంలో ఎవ్వరి దగ్గరా లేనటువంటి మోడల్స్‌ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అరుదైన కార్లను కలిగి ఆయన రికార్డు కూడా సృష్టించారు. అయితే, ఓ కారు విషయంలో మాత్రం ఆయన వెనకబడిపోయారు. ఆ కారు విషయంలో ఓ నటి పేరిట రికార్డు ఉంది.

ముఖేష్‌ అంబానీ కంటే ముందే ఆమె దగ్గర ఆ కారు ఉంది. ఇంతకీ ఆ కారు ఏదో కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు కలిగిన లగ్జరీ కారు ‘‘ రోల్స్‌ రాయిస్‌’’.. ఆ కారును ఎవరికి పడితే వారికి ఇవ్వరు. వీటిని ఎక్కువగా కూడా తయారు చేయరు. ఈ కారు పొందాలంటే.. సంఘంలో పేరు, ప్రతిష్టలు కలిగి ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ చేసిన తర్వాతే కారును ఇస్తారు. అలాంటి ఈ కారును ముఖేష్‌ అంబానీ కంటే ముందు.. ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి నదిరా సొంతం చేసుకున్నారు.

ఈమె 1950-70 వరకు నదిరా బాలీవుడ్‌లో పీక్సీ స్టార్‌డమ్‌ను ఆస్వాదించారు. స్టార్‌ హీరోలతో పోటీ పడి రెమ్యూనరేషన్‌ తీసుకున్నారు. కేవలం 11 ఏళ్లు ఉన్నపుడే సినిమాల్లోకి వచ్చారు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 1980-90లలో సినిమాల్లో నటించడం తగ్గించారు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చారు. ఆమె నటించిన సినిమాల్లో శ్రీ 420 సినిమాకు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో ఆమె నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించారు. 1960ల టైంలోనే ‘‘రోల్స్‌ రాయిస్‌’’ను కొన్నారు. అప్పట్లో స్టార్‌ హీరో దగ్గర కూడా ఆ కారు లేదు. షూటింగులకు ఆమె ఆ కారులోనే వెళ్లే వారు.

Actress nadira buy rolls royce before amabani

2000 సంవత్సరం తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు. షారుఖ్‌ ఖాన్‌తో జోష్‌లో కేమియో అప్పియరెన్స్‌ ఇచ్చారు. ఇక, 2006లో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడింది. పలు అనారోగ్య కారణాల వల్ల 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయారు. రోల్స్‌ రాయిస్‌ విషయంలో మాత్రం ఇప్పటికీ.. ఎప్పటికీ ఓ రికార్డు నదిరా సొంతం. మరి, ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ కంటే.. లగ్జరీ రోల్స్‌ రాయిస్‌ను సొంతం చేసుకుని బాలీవుడ్‌ సీనియర్‌ నటి నదిరా రికార్డు సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş