Revolt RV1: తక్కువ ధరకే పెట్రోల్ బైక్ లని తలదన్నే ఎలక్ట్రిక్ బైక్? 160 km రేంజ్, సూపర్ ఫీచర్లు!

Revolt RV1: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో రివోల్ట్ బైక్స్‌ దూసుకుపోతున్నాయి. తాజాగా రివోల్ట్ సరికొత్త RV1 ఎలక్ట్రిక్ బైక్‌ని లాంచ్‌ చేసింది. ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే..

Revolt RV1: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో రివోల్ట్ బైక్స్‌ దూసుకుపోతున్నాయి. తాజాగా రివోల్ట్ సరికొత్త RV1 ఎలక్ట్రిక్ బైక్‌ని లాంచ్‌ చేసింది. ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే..

ఎలక్ట్రిక్ బైక్స్‌కి రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. చాలా కంపెనీలు మోటార్‌ సైకిళ్లని ప్రవేశపెడుతున్నాయి. అందులో రివోల్ట్ మోటార్స్‌(Revolt Motors) మార్కెట్లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో 70 శాతం రివోల్ట్ బైక్స్‌ దూసుకుపోతున్నాయి. తాజాగా కంపెనీ సరికొత్త RV1 ఎలక్ట్రిక్ బైక్‌ని లాంచ్‌ చేసింది. ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ సరికొత్త బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, 6 ఇంచెస్‌ డిజిటల్ LCD ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. కఠినమైన రోడ్ల మీద కూడా ఈజీగా ప్రయాణించేలా ఈ బైక్ లో భారీ టైర్లని ఫిక్స్ చేశారు. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్‌తో సేఫ్టీని ఇంకా పెంచారు.

ఇక రివోల్ట్ ఆర్‌వీ1 ఎలక్ట్రిక్ బైక్ మిడ్-మోటార్ మరియు చైన్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ లో రెండు బ్యాటరీ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఒకటి 2.2 kWh బ్యాటరీ. ఇది 100 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. మరొకటి 3.24 kWh బ్యాటరీ. ఇది ఏకంగా 160 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది.పైగా ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లు కూడా ఐపీ 67-రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తాయి. రైడర్లకు ఎంతో కఠినమైన సమయాల్లో ఇతర వాతావరణ పరిస్థితుల్లో మంచి ఫర్ఫామెన్స్‌ అందిస్తుంది ఈ సూపర్ బైక్. ఇక ఈ బైక్ ను ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 1.5 గంటల్లోనే ఛార్జ్ చేయవచ్చు. దీంతో రైడర్ కి ఎక్కువ టైం సేవ్ అవుతుంది. రివోల్ట్ RV 1 పేలోడ్ కెపాసిటీ 250 కిలోలు ఉంటుంది.

రివోల్ట్ ఆర్‌వీ1 మల్టీ రైడ్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం స్పీడ్ మోడ్స్‌, రివర్స్ మోడ్స్‌ని అందిస్తుంది. ఇందులో ఉండే రివర్స్‌ మోడ్‌ ఫీచర్ వలన పార్కింగ్‌ సమయాల్లో ఇబ్బంది కలగకుండా చేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. ఈ సరికొత్త రివోల్ట్ ఆర్‌వీ 1 ఎలక్ట్రిక్ బైక్‌ని కంపెనీ మొత్తం రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో RV1 బైక్‌ని రూ.84,990 ధరతో విడుదల చేసింది. RV1 ప్లస్ ప్రీమియం వెర్షన్ ని రూ.93,790 ధరతో విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్లు కూడా పెట్రోల్ మోటార్ సైకిళ్ల కంటే తక్కువ ధరలో ధరలో రావడం విశేషం. ఇక తాజాగా రివోల్ట్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త RV1 ఎలక్ట్రిక్ బైక్‌ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments