iDreamPost
android-app
ios-app

కొత్తగా ఇల్లు కొన్నారా? మీకు ఆదాయపు పన్ను శాఖ నుండి గుడ్ న్యూస్!

ఇల్లు కొనాలనుకుంటున్నారు. ఎవరి దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నారా..? అయితే మీకు ఆదాయపు పన్ను శాఖ నుండి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అయితే మీరు చేయాల్సిందంతా ఇదే.

ఇల్లు కొనాలనుకుంటున్నారు. ఎవరి దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నారా..? అయితే మీకు ఆదాయపు పన్ను శాఖ నుండి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అయితే మీరు చేయాల్సిందంతా ఇదే.

కొత్తగా ఇల్లు కొన్నారా? మీకు ఆదాయపు పన్ను శాఖ నుండి గుడ్ న్యూస్!

ఇల్లే కదా స్వర్గ సీమ.. ప్రతి ఒక్కరికీ సొంతింటిని నిర్మించుకోవాలన్న కల ఉంటుంది. ఆ కల తీర్చుకునేందుకు తమ జీతంలో కొంత భాగాన్ని వెనకేసుకుంటూ ఉంటారు. అలాగే భూమి ధరలు, ప్లాట్ రేట్స్ ఎక్కడ ఎలా ఉన్నాయో చెక్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారులను తరచుగా సంప్రదిస్తుంటారు. తమ బడ్జెట్‌కు తగ్గ గృహం కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. అయితే ఇల్లు కొనడం మాట పక్కన ఉంచితే.. కొన్ని పన్నులు కస్టమర్లకు పోట్లుగా మారాయి. దీంతో చాలా మందిలో కొనాలన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. తాజాగా గృహ కొనుగోలు దారులకు భారీ ఊరటను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆదాయపు పన్ను శాఖ.  గృహ కొనుగోలుదారులకు అదనపు TDS (టాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్) నుంచి తక్షణ ఉపశమనం ఇచ్చింది

కొత్త రూల్స్ ప్రకారం.. ఆస్తిని విక్రయించే అమ్మకం దారులు మే 31 లోపు తమ పాన్-ఆధార్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే గృహ కొనుగోలు దారులకు పడుతున్న అదనపు టీడీఎస్ ఇక ఉండదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా సెల్లర్ డిఫాల్ట్ అయితే కొనుగోలుదారు పెరిగిన రేటుతో అదనపు TDS చెల్లించాలి.  ఇది కొనుగోలు దారులకు భారంగా మారింది. ఆధార్-పాన్ లింక్ చేయని ప్రాపర్టీ సెల్లర్లకు ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే నోటీసులు కూడా పంపించింది. గత ఏడాదిలో కొనుగోలు చేసిన ప్రాపర్టీకి అదనపు టీడీఎస్ చెల్లించాలని కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుంచి దాదాపు 16,000 మంది బయ్యర్లు నోటీసులు అందుకున్నారు. ఆస్తిని విక్రయించిన సదరు విక్రేతల పాన్ నంబర్లు యాక్టివ్‌లో లేకపోవడంతో పాటు కొన్ని ఆధార్‌తో లింక్ చేయలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ భారమంతా గృహ కొనుగోలు దారుడికి పడుతోంది.

Bought a new house 02

చట్టప్రకారం కొనుగోలుదారు ఆ అదనపు పన్ను చెల్లించాల్సి వచ్చింది. అయితే తాజాగా జారీ అయిన సర్క్యులర్ ప్రకారం అదనపు టీడీఎస్ విషయంలో పెద్ద ఉపశమనం ఇచ్చింది. ప్రాపర్టీ విక్రేతలకు తమ పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసేందుకు ఈ నెల చివరి వరకు సమయం ఇచ్చింది. అదనపు టీడీఎస్ కట్టాలంటూ నోటీసులు స్కిప్ చేయాలంటే.. కొనుగోలుదారు తన పాన్‌ను తన ఆధార్‌తో లింక్ చేయమని ఆస్తి అమ్మిన వ్యక్తిని అభ్యర్థించవలసి ఉంటుంది. పన్ను నిబంధనల ప్రకారం ఎవరైనా ఓ వ్యక్తి రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తిని కొనుగోలు చేస్తే.. అమ్మకపు ధరలో ఒక శాతం టీడీఎస్ మినహాయించి, దానిని ప్రభుత్వానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆస్తి విక్రేతకు పాన్ లేకుంటే లేదా పని చేయనిదిగా పరిగణించబడితే టీడీఎస్ 20 శాతానికి పెరుగుతుంది. ఇది కొనుగోలు చేసిన వ్యక్తికి భారం అవుతుంది. అయితే జులై 1, 2023 నుండి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను నిబంధనల ప్రకారం.. విక్రేతలు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే.. పాన్ కార్డ్ ఇన్-యాక్టివ్ చేయబడుతుందని ప్రకటించింది.

అలా కార్డు లింక్ చేయని పక్షంలో ప్రాపర్టీ కొన్న వ్యక్తులకు అదనంగా 19 శాతం టీడీఎస్ చెల్లించాలని నోటీసులు జారీ అవుతున్నాయి. వాస్తవానికి ఈ రూల్స్ ఇల్లు కొనుగోలు దారులకు చాలా ఇబ్బందిగా మారాయి. ఈ విషయంలో పన్ను శాఖ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే బాధ్యత అమ్మకందారుడిపై ఉంచాలని, కొనుగోలుదారులపై TDS భారం వేయకూడదని నిపుణులు అంటున్నారు. అలాగే తాజాగా అందించిన గడువు తేదీలోగా వారు పాన్-ఆధార్ వివరాలను లింక్ చేయకపోతే నేరుగా విక్రేతకే నోటీసులు పంపాలని సూచిస్తున్నారు. కాగా,ప్రస్తుత చట్టంలో కొనుగోలుదారులను బాధ్యులను చేస్తూ నోటీసులు వెళుతుండటంతో.. కొంత మంది గృహ కొనుగోలు దారులు కోర్టుకు వెళుతున్నారు. ఇందులో తమ తప్పులేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విక్రేతలపైనే పాన్-ఆధార్ లింక్ చేయాలన్న బాధ్యతను వీరికి అప్పగించింది ఆదాయపు పన్ను శాఖ. తద్వారా అదనపు టీడీఎస్ నుండి ఉపశమనం పొందొచ్చు.