iDreamPost
android-app
ios-app

Anil Ambani: అప్పులన్నీ తీర్చేసిన అనిల్ అంబానీ..తిరిగి పుంజుకుంటున్నాడు! కారణం ఇదే..

Anil Ambani: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనీల్ అంబానీ గురించి అందరికి తెలుసు. చాలా కాలంగా ఆయన అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. అయితే ఇటీవల ఆయన పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. వ్యాపారంలో తిరిగి పుంజుకున్నట్లు కనిపిస్తోంది.

Anil Ambani: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనీల్ అంబానీ గురించి అందరికి తెలుసు. చాలా కాలంగా ఆయన అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. అయితే ఇటీవల ఆయన పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. వ్యాపారంలో తిరిగి పుంజుకున్నట్లు కనిపిస్తోంది.

Anil Ambani: అప్పులన్నీ తీర్చేసిన అనిల్ అంబానీ..తిరిగి పుంజుకుంటున్నాడు! కారణం ఇదే..

సాధారణంగా మనం సమాజంలో అనేక రకాల కుటుంబాలను చూస్తుంటాము. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్ల ఆర్థిక పరిస్థితుల్లో చాలా వ్యత్యాసలు ఉంటాయి. ఒకరు ఆర్థికంగా బలంగా ఉండగా, మరొకరు అప్పులతో సతమతం అవుతుంటారు. అచ్చం అలాంటి పరిస్థితులు అంబానీ కుటుంబంలో కనిపించాయి. వ్యాపార రంగంలో ముఖేస్ అంబానీ దూసుకెళ్తోంటే..అనీల్ అంబానీ చాలా వెనుకబడ్డారు. అప్పులలో కూరుకుపోయి..తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అది కొన్ని రోజుల క్రితం వరకు ఉన్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో అనీల్ అంబానీ ఆర్థిక పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అదే అనిపిస్తుంది. అప్పులన్నీ తీర్చి..మళ్లీపుంజుకుంటున్నాడు.

ఇటీవల కొన్ని రోజుల నుంచి అనీల్ అంబానికి చెందిన కంపెనీల్లోని అప్పులన్నీ తీరుస్తూ దూసుకెళ్తున్నారు. తన వ్యాపారాల్లో వచ్చిన నష్టాల నుంచి కోలుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అవే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు స్టాక్ మార్కెట్ లో అదరగొడుతున్నాయి. బుధవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో రిలయన్స్ పవర్ షేరు 5 శాతానికి పైగా పెరిగి దూసుకెళ్లింది.

ఇలా రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు స్టార్ మార్కెట్ లో రాణించడానికి ఓ ప్రధాన కారణం ఉంది. ఈ కంపెనీలో ఉన్న అప్పులన్నీ అనీల్ అంబానీ తీర్చేశారు. మొత్తంగా రూ.3872 కోట్ల అప్పులను క్లియర్ చేసి..జీరో డెట్ కంపెనీగా అవతరించేలా చేశాడు. కార్పొరేట్ గ్యారెంటీ, అండర్ టేకింగ్స్, బకాయి రుణాలకు సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి కంపెనీ బయటపడినట్లు అయింది. ఈ క్రమంలోనే సీఎఫ్ఎం అసెట్ రీకన్‌స్ట్ర క్షన్‌ తో ఉన్న అన్ని వివాదాలు పరిష్కారమైనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అనీల్ అంబానికి చెందిన రిలయన్స్ పవర్ పూర్తిగా అప్పులు లేని కంపెనీగా అవతరించింది.

ఈ నేపథ్యంలోనే నేడు ఈ స్టాక్ ఇవాళ లైమ్ లైట్ లోకి వచ్చింది. పై సమాచారాన్ని తన స్టాక్ ఎక్స్ చేంజీ ఫైలింగ్ లో రిలయన్స్ పవర్ కంపెనీ వెల్లడించింది. తమ కంపెనీ జీరో లోన్ స్టేటస్ పొందినట్లు తెలిపింది. బ్యాంకులు, వివిధ రకాల ఆర్థిక సంస్థల నుంచి తమకు ఎటువంటి అప్పులు లేవని రిలయన్స్ పవర్ కంపెనీ పేర్కొంది.  ఈ ఏడాది జూన్ 30 నాటికి ఈ కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రూ. 1,155 కోట్లుగా ఉన్నట్లు పలు నివేదికలు తెలిపాయి. ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో రిలయన్స్ పవర్ స్టాక్ దూసుకెళ్తోంది. బుధవారం జరిగిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చూసినట్లు అయితే రిలయన్స్ పవర్ అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. 5 శాతం లాభంతో ప్రారంభమై గరిష్ట పాయింట్ వద్ద లాక్ అయింది.

ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.38.11 వద్ద ఉంది. అలాగే 52 వారాల కనిష్ఠ ధర రూ. 15.55 వద్ద  ఆగింది. రిలయన్స్ పవర్ కంపెనీ స్టాక్ గత 5 సెషన్లలో 11 శాతం పెరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో చూస్తే మాత్రం ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా రూ. 11 లక్షలకుపైగా అందించింది. ఇక తాజా పరిస్థితులను చూసినట్లు అయితే..అనీల్ అంబానీ వ్యాపార రంగంలో మళ్ళీ పుంజుకోనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి..ప్రస్తుతం అనీల్ అంబానీ కంపెనీ స్టాక్ మార్కెట్ లో దూసుకెళ్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.