Arjun Suravaram
Reliance Jio Launches JioTV Plus: టీవీ విభాగంలోనూ తనదైన ముద్ర వేసే దిశగా రిలయన్స్ జియో అడుగులు వేస్తుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా మరో సూపర్ ఆఫర్ ను జియో ప్రారంభించింది.
Reliance Jio Launches JioTV Plus: టీవీ విభాగంలోనూ తనదైన ముద్ర వేసే దిశగా రిలయన్స్ జియో అడుగులు వేస్తుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా మరో సూపర్ ఆఫర్ ను జియో ప్రారంభించింది.
Arjun Suravaram
రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో వినిపిస్తుంది. అంతకంటే ముందు..తమదైన సంచలన నిర్ణయాలతో టెలికాం రంగంలో సెపరెట్ బ్రాండ్ ను క్రియేట్ చేసింది. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాలింగ్, జీబీల కొద్ది డేటా ఇస్తూ..టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించింది. ఇలా కేవలం టెలికాం రంగానికి మాత్రమే పరిమితం కాకుండా టీవీ విభాగంలోనూ తనదైన ముద్ర వేసే దిశగా జియో అడుగులు వేస్తుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించిన జియో..మరో సారి సూపర్ ప్లాన్ తో కస్టమర్ల ముందుకు వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రిలయన్స్ జియో “జియో టీవీ ప్లస్ టూ-ఇన్-వన్” అనే సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సూపర్ ఆఫర్ ద్వారా వినియోగదారులు చాలా బెనిఫిట్స్ పొందవచ్చు. కస్టమర్లు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ని వినియోగించి.. ఒకేసారి రెండు టీవీలను రన్ చేసుకొవచ్చు. ఈ టూ ఇన్ వన్ ప్లాన్‌తో, జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా కస్టమర్లు, 800కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు. అలానే 13 ప్రముఖ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. ఇప్పటికే జియో టీవీ ప్లస్ యాప్ లో అనేక రకాల కంటెంట్ ను అందిస్తుంది. మొత్తం 10 లాంగ్వేజ్ లు, 20 కేటగిరీల్లో 800 కంటే ఎక్కువ కంటెంట్ ను అందిస్తోంది. ఈ విస్తృతమైన ఛానెల్ లైనప్‌తో పాటు కస్టమర్లు ఒకే లాగిన్ నుండి 13కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.
ఇక తాజా ఆఫర్ తో జీయో టీవీలో కొన్ని రకలా ఫీచర్లు పొందవచ్చు. ఒకే లాంగిన్ తో రెండు టీవీల్లో 13 కి పైగా ఓటీటీ కంటెంట్ ను చూడవచ్చు. ఛానల్స్ , ఓటీటీ మధ్య నావిగేషన్ కోసం స్మార్ట్ రిమోట్ కంట్రోల్ ఉంటుంది. అంతేకాక మీ ఆస్తకి ప్రకారం..మీరు చూసే కంటెంట్ ను సిఫారుసు చేస్తుంది. సులభంగా కోరుకున్న కంటెంట్ చూసేలా సెర్చ్ ఆప్షన్స్, వాయిస్ అసిస్ట్ సెర్చ్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సేవలన్ని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లలో అందుబాటులో ఉన్నాయి.
జియో కస్టమర్ల కోసం రూ. 599 రూ. 899 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలోఅందుబాటులో ఉంది. జియో టీవీ ఫ్లస్ యాప్ కలర్స్ టీవీ, స్టార్ ప్లస్, జీ టీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. మొత్తంగా జియో తీసుకొచ్చిన జియో టీవీ ప్లస్ టూ-ఇన్-వన్ ఆఫర్ వినియోగదారులు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నరు. మరి..జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.