iDreamPost
android-app
ios-app

మీ దయ వల్ల జియో ఖాతాలో సరికొత్త రికార్డు.. ఈ పుణ్యం కోట్లాది కస్టమర్లదే!

  • Published Jul 20, 2024 | 10:35 PMUpdated Jul 20, 2024 | 10:35 PM

Jio New Record: జియో ధరలను పెంచిన తర్వాత వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది యూజర్లు జియో నుంచి వేరే నెట్వర్క్ కి షిఫ్ట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో జియో ఒక సరికొత్త రికార్డుని సృష్టించింది.

Jio New Record: జియో ధరలను పెంచిన తర్వాత వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది యూజర్లు జియో నుంచి వేరే నెట్వర్క్ కి షిఫ్ట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో జియో ఒక సరికొత్త రికార్డుని సృష్టించింది.

  • Published Jul 20, 2024 | 10:35 PMUpdated Jul 20, 2024 | 10:35 PM
మీ దయ వల్ల జియో ఖాతాలో సరికొత్త రికార్డు.. ఈ పుణ్యం కోట్లాది కస్టమర్లదే!

వ్యక్తులైనా, వ్యవస్థలైనా సక్సెస్ అవ్వడం వెనుక ఎంతోమంది పేద ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజల కృషి ఉంటుంది. వ్యక్తుల రికార్డుల వెనుక, వ్యవస్థల రికార్డుల వెనుక ఈ జనం సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఆర్ధిక విజయాల్లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. రిలయన్స్ జియో విషయంలో కూడా అదే జరిగింది. ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జియో బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు కూడా టారిఫ్ ధరలను పెంచేశాయి. దీంతో జియో సహా ఈ నెట్వర్క్ లపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జియో నుంచి చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి మారిపోయారని పలు గణాంకాలు చెబుతున్నాయి.

అయితే ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా జియో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఈ కొత్త రికార్డుతో చైనా కంపెనీలను సైతం వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా రిలయన్స్ జియో.. డేటా వినియోగంలో ఒక కొత్త రికార్డుని సృష్టించింది. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. జియో వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. జియో డేటా వినియోగం మొత్తం 4400 కోట్ల జీబీ దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ. ఈ గణాంకాల ప్రకారం.. యూజర్లు ప్రతి రోజూ ఒక జీబీ కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారు. ఇక 5జీ డేటా ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 13 కోట్లకు చేరిందని జియో వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

4జీ ప్లాన్ రీఛార్జ్ తో అర్హత కలిగిన వినియోగదారులు 5జీ డేటాను వినియోగించుకుంటున్నారు. దీన్ని బట్టి 5జీ డేటా వాడుకునేవారి శాఖ సంఖ్య బాగా పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం జియోకి 49 కోట్ల కంటే ఎక్కువ వినియోగదారులు ఉన్నట్లు తెలుస్తోంది. జియో డేటా వినియోగించుకునే యూజర్ల సంఖ్య మాత్రమే కాదు.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ ని వినియోగించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు జియో ఎయిర్ ఫైబర్ సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జియో రికార్డు విషయంలో ఆ కంపెనీ యూజర్ల కంట్రిబ్యూషన్ ఎంతగానో ఉందనేది మరోసారి రుజువైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి