Dharani
Reliance-Solar Giga Plant: ముఖేష్ అంబానీ.. 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో.. ఆ రంగాన్ని శాసించేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..
Reliance-Solar Giga Plant: ముఖేష్ అంబానీ.. 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో.. ఆ రంగాన్ని శాసించేందుకు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..
Dharani
ముఖేష్ అంబానీ.. వ్యాపార సామ్రాజ్యం.. అంచెలంచెలుగా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. అనేక రంగాల్లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే టెలికాం వంటి రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. విజయవంతంగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఇప్పుడు మరో రంగంపై దృష్టి సారించారు. ఏకంగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ నిర్ణయంతో దేశంలో ఆ రంగాన్ని శాసించే శక్తిగా రిలయన్స్ ఇండస్ట్రీ ఎదగనుంది. ఇంతకు ముఖేష్ అంబానీ ఎంట్రీ ఇవ్వబోతున్న రంగం ఏది.. ఎందుకు ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు అంటే..
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. గ్లోబల్ వార్మింగ్. అభివృద్ధి పేరిట ప్రపంచ దేశాలు చేపడుతున్న చర్యలు వాతావరణాన్ని, పర్యవరణాన్ని నాశనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ సహా ప్రపంచ దేశాలు.. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ.. నెట్ జీరో దిశగా కదలాలని భావిస్తున్నాయి. అందుకోసం గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆయా దేశాల వ్యాపారవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక మన దేశంలో అంబానీ, అదానీలు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అంబానీ మాత్రం ఓ అడుగు మందుకేసి.. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో.. భారీ ప్లాన్‌కు తెర తీశారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముఖేష్ అంబానీ రెడీ అయ్యారు. దీనిలో భాగంగా గుజరాత్‌లో ఏకంగా ఓ సోలార్ విలేజ్‌ను నెలకొల్పబోతున్నారు. ఈ ఏడాదిలోనే దీన్ని ప్రారంభిచబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. వేఫర్స్, పాలీ సిలికాన్, గ్లాస్, పీవీ మాడ్యూల్స్, సెల్స్ వంటి పలు ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇక ప్లాంట్‌లో ముందుగా సెల్ ఉత్పత్తి చేయబోతున్నట్లు రిలయన్స్ తాజాగా ప్రకటించిన కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే తాము తయారు చేసిన సోలార్ ప్యానెళ్లకు బీఐఎస్ సర్టిఫికెట్ లభించినట్లు రిలయన్స్ చెప్పుకొచ్చింది.
ఇతర రంగాలతో పోలిస్తే.. గ్రీన్ ఎనర్జీ విభాగం మరో ఐదేళ్లలో భారీ వృద్ధి నమోదు చేయడం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అంతేకాక ఎలక్ట్రిఫయర్‌లను తయారు చేసేందుకు గాను తమ కంపెనీ ప్రభుత్వ సహాయానికి అర్హత సాధించినట్లు రిలయన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలోనే గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాక.. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. దానిలో భాగంగా.. గుజరాత్ జామ్ నగర్‌లో ఈ ప్లాంట్‌ను స్థాపించనుంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో స్థాపించనున్న ఈ గిగా ప్లాంట్‌కు ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్‌గా నామకరణం చేశారు.