iDreamPost
android-app
ios-app

Mukesh Ambani: మొన్న కొడుకు పెళ్లి అంత గ్రాండ్‌గా చేసి.. ఇప్పుడేమో మరీ పిసినారిగా!

  • Published Aug 08, 2024 | 12:37 PM Updated Updated Aug 08, 2024 | 12:37 PM

Mukesh Ambani-Zero Salary: ముఖేష్‌ అంబానీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అది తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Mukesh Ambani-Zero Salary: ముఖేష్‌ అంబానీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అది తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Published Aug 08, 2024 | 12:37 PMUpdated Aug 08, 2024 | 12:37 PM
Mukesh Ambani: మొన్న కొడుకు పెళ్లి అంత గ్రాండ్‌గా చేసి.. ఇప్పుడేమో మరీ పిసినారిగా!

ముఖేష్‌ అంబానీ.. లక్షల కోట్ల రూపాయలకు అధిపతి. ఇండియా కుబేరుడు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. ఇక కొన్ని రోజుల క్రితమే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లిని అంగరంగా వైభవంగా చేశారు. ప్రపంచ దేశాల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. నెల రోజుల పాటు.. ఎక్కడ చూసిన అనంత్‌ అంబానీ పెళ్లి ముచ్చట్లే. పెళ్లిలో ధరించిన దుస్తుల నుంచి.. వడ్డించిన భోజనం.. ఇచ్చిన బహుమతుల వరకు ప్రతీది వార్తే అయ్యింది. ఇంట్లో ఎలాంటి శుభకార్యమైనా సరే భారీగా, గ్రాండ్‌గా చేయడం అంబానీకే చెల్లుతుంది. ఇదిలా ఉంటే తాజాగా అంబానీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది. కుమారుడి పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అంబానీ ఓ విషయంలో మాత్రం మహా పిసినారిగా వ్యవహరిస్తున్నారట. ఆ వివరాలు..

తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన వార్షిక నివేదిక ప్రకటించింది. దీనిలో సంస్థ పని తీరు, ఫలితాలు, ఉద్యోగుల సంఖ్య, భవిష్యత్తు ప్రణాళికలు తదితర విషాయల గురించి రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వివరించారు. ఈక్రమంలోనే యాన్యువల్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిల్లో ముఖ్యమైంది.. వరుసగా నాలుగో ఏడాది కూడా ముఖేష్‌ అంబానీ జీతం తీసుకోలేదంట. అంతకుముందు అంబానీ 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు ఏటా రూ. 15 కోట్ల చొప్పున వేతనం అందుకున్నారు.

mukesh ambani no salary

ఆ తర్వాతి నుంచి అనగా.. కరోనా వచ్చిన కాలం నుంచి అనగా.. 2020-21 ఆర్థిక సంవత్సరం నంచి ఆయన వేతనం వదులుకున్నారు. జీతం తీసుకోకుండానే పని చేస్తున్నారు. కరోనా కాలంలో అన్ని వ్యాపారాలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ తమ వ్యాపార కార్యకలాపాలు తిరిగి పుంజుకునే వరకు జీతం తీసుకోకూడదని ముఖేష్‌ అంబానీ నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా ఈ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ఆయన వేతనం అందుకోలేదు. సున్నా వేతనానికే పరిమితం అయ్యారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి ముకేశ్ అంబానీ వేతనం, భత్యాలు సహా ఇతరత్రా ప్రయోజనాలు ఏం పొందలేదని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇక మరో ఐదేళ్లు అంటే 2029 వరకు కూడా అంబానీ సున్నా వేతనానికే పని చేయాడానికే కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చింది. జీతం తీసుకోనప్పటికి.. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు రిలయన్స్ సంస్థలో మొత్తంగా 332.27 కోట్ల షేర్లు లేదా 50.33 శాతం వాటా ఉంది. ఈ షేర్లతో వచ్చిన డివిడెండ్‌తోనే అంబానీ కుటుంబం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3322.7 కోట్లు ఆర్జించింది.

ఈ వార్త తెలిసిన వారు.. కంపెనీ, ఉద్యోగుల అభివృద్ధి కోసం అంబానీ కోట్ల రూపాయల జీతాన్ని త్యాగం చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు తగ్గాలో తెలిసి ఉండటం ఎంత ముఖ్యమో.. వ్యాపారంలో ఎక్కడ ఖర్చు చేయాలి.. ఎక్కడ పొదుపు చేయాలి అన్న విషయాలు తెలిసిన వాడే విజయవంతమైన బిజినెస్‌మ్యాన్‌ అవుతారు. అంబానీ విషయంలో ఇది నిరూపితం అయ్యింది అని అంటున్నారు. కొడుకు పెళ్లి అనేది స్వవిషయం కనుక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అంబానీ.. కంపెనీ, ఉద్యోగుల అభివృద్ధి కోసం.. తన జీతం విషయంలో మాత్రం పిసినారిగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు.