iDreamPost
android-app
ios-app

వినియోదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ఫ్లాన్ ధరలు!

మొబైల్‌ రీఛార్జీ ధరలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత రెండేళ్లుగా ఛార్జీలు పెంచని టెలికాం కంపెనీలు ఇప్పుడు ఎన్నికల తర్వాత భారీగా ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

మొబైల్‌ రీఛార్జీ ధరలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత రెండేళ్లుగా ఛార్జీలు పెంచని టెలికాం కంపెనీలు ఇప్పుడు ఎన్నికల తర్వాత భారీగా ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

వినియోదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ఫ్లాన్ ధరలు!

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. వీటి వాడకం బాగా పెరిగిపోయింది. ఇక వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తుంచాయి. ముఖ్యంగా ప్రముఖ టెలికాం కంపెనీలు అయితే పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఐపీఎల్, వర్డల్ కప్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇలా తమ ఆదాయన్ని పెంచుకోవడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇలా గుడ్ న్యూస్ లు చెప్పే టెలికాలం కంపెనీలు యూజర్లకు బ్యాడ్ న్యూస్ కూడా చెబుతుంటాయి. తాజాగా రీఛార్జ్ ప్లాన్ ల ధరలను భారీగా పెంచనున్నట్లు సమాచారం.

టెలికాం సంస్థలు యూజర్లను ఆకట్టుకుంటూనే ధరలను పెంచిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు టెలికాం కంపెనీలు శుభవార్త చెప్పాయి. అతి తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్లాన్ ను అందిస్తున్నట్లు ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఐపీఎల్ సీజన్ వరకు మాత్రమే వర్తిస్తుందని సదరు సంస్థ పేర్కొంది. అయితే తాజాగా రీఛార్జ్ ఫ్లాన్ ధరలను భారీగా పెంచతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలో జరగనున్నలోక్‌సభ ఎన్నికలు 2024 సందర్బంగా టెలికాం రంగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయని టాక్ వినిపిస్తోంది. యూజర్లపై భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు పూర్తవగానే వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. టారీఫ్ ఛార్జీలను పెంచాలని టెలికాం రంగాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం కాదంట.

లోక్ సభ ఎన్నికల తరువాత ఈ పెంచిన ధరలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో టెలికాం సంస్థ 15 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఛార్జీలు పెంచనున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 4జీ, 5జీ సేవలు వచ్చినప్పటి నుంచి టెలికాం సంస్థలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. అయితే ఈసారి పెంచే ధరల్లో కొత్తగా వచ్చే యూజర్ల ప్రత్యేక ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాయి. 5జీ సేవల కోసం టెలికాసం సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు, మూడేళ్ల నుంచి ఎటువంటి ఛార్జీలు పెంపు చేయలేదు. ఇదే సమయంలో టెలికాలం సంస్థలు పెట్టిన పెట్టుబడులతో ఖర్చులు కూడా భారీ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెట్టిన ఖర్చును తిరిగి పొందేందుకు వినియోదారులపై భారాన్ని మోపేందుకు టెలికాం సంస్థలు సిద్ధమైనట్లు టెలికాలం మార్కెట్ నిపుణలు అభిప్రాయా పడుతున్నారు.