iDreamPost
android-app
ios-app

Realme Narzo N63: 8 వేలకే అదిరే స్మార్ట్ ఫోన్.. డీల్‌ మాములుగా లేదుగా

Realme Narzo N63: కళ్ళు చెదిరే ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ కొనాలంటే 15 వేలు పైనే పెట్టుబడి పెట్టాలి. అయితే రియల్ మీ నుంచి వచ్చిన ఈ ఫోన్ కి కేవలం 8 వేలు పెడితే చాలు.. అదిరిపోయే ఫీచర్స్ ని పొందవచ్చు.

Realme Narzo N63: కళ్ళు చెదిరే ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ కొనాలంటే 15 వేలు పైనే పెట్టుబడి పెట్టాలి. అయితే రియల్ మీ నుంచి వచ్చిన ఈ ఫోన్ కి కేవలం 8 వేలు పెడితే చాలు.. అదిరిపోయే ఫీచర్స్ ని పొందవచ్చు.

Realme Narzo N63: 8 వేలకే అదిరే స్మార్ట్ ఫోన్.. డీల్‌ మాములుగా లేదుగా

స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల కాంపిటేషన్ వలన ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా రూ. 10 వేలలోపు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇండియాలో ఎక్కువ మంది ఉండడం వల్లనే టార్గెట్ ఆడియన్స్ చేసుకుని కంపెనీలు కొత్త కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా రియల్‌మీ నార్జో ఎన్‌63 పేరుతో ఓ కొత్త ఫోన్‌ను వచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ మన దేశంలో కొత్త ఫోన్‌ సేల్స్‌ను మొదలు పెట్టేసింది. రియల్‌మీ నార్జో ఎన్‌63 పేరుతో ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ సైట్ అయిన అమెజాన్‌తో పాటు రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ప్రీమియం లేగన్‌ వెదర్‌ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేశారు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ కాని రేటు మాత్రం 8,499 మాత్రమే.  అదే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ రేటు ఇంకో అయిదు వందలు ఎక్స్ట్రా తో 8,999గా అందిస్తున్నారు. రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేస్తే ఈ రేటుకు కూడా ఇంకో రూ. 500 డిస్కౌంట్‌ ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 7,999కే మీ సొంతం చేసుకోవచ్చు. 

ఫీచర్లు: 

  • 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రేర్ కెమెరా
  • సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరా
  • 63 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 45 వాట్స్‌ బ్యాటరీ, వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.  
  • మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు 
  • కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై, 4జీ వోల్ట్‌, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, గ్లోనాస్‌ వంటి ఫీచర్లను ఉన్నాయి.
  • 6.74 ఇంచెస్‌తో ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్సీడీ స్క్రీన్‌.
  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. 
  • యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై రియల్‌మీ నార్జో ఎన్63 పని చేయనుంది. 
  • 4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉంది. 

8 వేలకే ఇన్ని ఫీచర్స్ అంటే అసలు ఈ ఫోన్ ని వదులుకోకూడదు. మరి ఇండియాలో ఉన్న లోయర్ మిడిల్ క్లాసు వాళ్లనే మెయిన్ టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫోన్ సేల్స్ ఎలా ఉంటాయో ముందు ముందు చూడాలి. ఈ ఫోన్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి