iDreamPost
android-app
ios-app

బ్యాంకుల్లో రూ.78,213 కోట్లు అన్‌క్లెయిమ్ డిపాజిట్లు.. ఇలా చేసి సొంతం చేసుకోవచ్చు!

Reserve Bank of India: దేశంలో ఎలాంటి లావాదేవీలైనా బ్యాంక్‌ల ద్వారా జరుపుతుంటాం. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే సురక్షితం ఉంటాయని సమాన్యుల నుంచి సంపన్నుల భావిస్తుంటారు. అందుకే వేల నుంచి కోట్ల వరకు బ్యాంకుల్లో జాగ్రత్త పర్చుతుంటారు.

Reserve Bank of India: దేశంలో ఎలాంటి లావాదేవీలైనా బ్యాంక్‌ల ద్వారా జరుపుతుంటాం. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే సురక్షితం ఉంటాయని సమాన్యుల నుంచి సంపన్నుల భావిస్తుంటారు. అందుకే వేల నుంచి కోట్ల వరకు బ్యాంకుల్లో జాగ్రత్త పర్చుతుంటారు.

బ్యాంకుల్లో రూ.78,213 కోట్లు అన్‌క్లెయిమ్ డిపాజిట్లు.. ఇలా చేసి సొంతం చేసుకోవచ్చు!

ఒకప్పుడు తమ వద్ద ఉన్న డబ్బు, నగలు దాచుకోవాలంటే ఎన్నో రకాల రహస్య స్థావరాలు వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ కాలం మారింది.. బ్యాంకింగ్ సేవలు మొదలయ్యాయి. బ్యాంకు అనేది ఒక ఆర్థిక సంస్థ, ఇక్కడ కస్టమర్లు డబ్బును సురక్షితంగా దాచుకోవచ్చు.. రుణం పొందవొచ్చు. బ్యాంక్ చట్టాలు వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉంటాయి. ఒకప్పటికీ ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. దేశంలోని వివిధ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయాలు అన్ క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయి. మరి ఆ డబ్బు హక్కు దారులు ఎందుకు రావడం లేదు.. ఆ డబ్బు ఎవరైనా సొంతం చేసుకోగలరా? నిజమైన అర్హులకు ఆ డబ్బు డిపాజిట్ అవుతుందా? అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

భారత రిజర్వ్ బ్యాంక్ నివేధిక ప్రకారం.. బ్యాంకుల్లో ఇప్పటికీ వేల కోట్ల రూపాయాలు డబ్బు క్లయిమ్ చేయని వారు ఉన్నారు. మార్చి 2024 నాటికి ఆ అమౌంట్ రూ.78,213 కోట్ల రూపాయలకు చేరుకుంది. మార్చి 2023 నాటికి డిపాజిట్లు మొత్తం రూ.62,225 కోట్లు. ఏడాదిలోనే భారీగా పెరిగిపోయాయి. ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తే కొంత కాల పరిమితి వరకు వారికి అందుబాటులో ఉంచుతారు. అంతే 10లేదా అంతకన్న ఎక్కువ ఏళ్లు తమ ఖాతాలో డబ్బులు జమ చేసుకోకుంటే ఆ డిపాజిట్ మొత్తం ఆర్బీఐ డిపాజిట్ ఎడ్యూకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ కి బదిలీ అవుతుంది.కో-ఆపరేటీవ్ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులకు ఇదే వర్తింస్తుంది.

ఆర్బీఐ 2014 లో డిపాజిటర్ ఎడ్యూకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ (DEAF)ని స్థాపించబడింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నా ఇబ్బందే.. జనాలు తమ డబ్బను డిపాజిట్ చేసి మర్చిపోవడం లేదా అకాల మరణం పొందడం.. బ్యాంకు వివరాలు కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం వల్ల ఆ డబ్బు బ్యాంక్ లోనే ఉండిపోతుంది. ఎవరైనా క్లెయిమ్ దారుడు పక్కా ప్రూఫ్ తో వచ్చే వరకు బ్యాంక్ లో అంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకుంటాయి. ఎప్పుడైతే ఈ ఫండ్ ఏర్పాటు చేశారో అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమస్య తీరిందని చెప్పొచ్చు. సెంట్రల్ బ్యాంక్ కొన్ని నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం హక్కు దారులు డబ్బులు క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

హక్కుదారులు డబ్బు ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే:

  • అన్ని బ్యాంకులు పేర్లు, చిరునామాలతో పనిచేయని ఖాతాలు, అన్ క్లైయిమ్ చేయని అకౌంట్ల జాబితాను రిలీజ్ చేస్తాయి.
  • మీ పేరు ఏదైన జాబితాలో ఉందో లేదో చూడాలి. ప్రతి బ్యాంక్ వెబ్ సైట్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి
  • మీరు మీ పేరు లేదా బంధువు పేరు ఉంటే.. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ని సంప్రదించాలి
  • సదరు బ్యాంకు వారు ఇచ్చిన అప్లి కేషన్ పూర్తి చేయాలి
  • కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన పత్రాలు సమర్పించాలి
  • డిపాజిట్ చేసిన ఖాతాదారుడు చనిపోతే రిజిస్టర్డ్ నామినీ లేదా, రిజిస్టర్డ్ నామినీ కూడా చనిపోతే ఆ మొత్తం వీలునామా ప్రకారం వారసత్వ ధృవ పత్రం ఉన్నవారికి దక్కుతుంది
  • పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే.. కొన్ని బ్యాంకులు సబ్యులు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అడుగుదారు.
  • ధృవ పత్రాలు వెరిఫికేషన్ చేసిన తర్వాత మొత్తం వడ్డీతో సహా క్లెయిమ్ దారుడికి బదిలీ అవుతుంది.
  • మరి ఇంకెందుకు ఆలస్యం మీకు సంబంధించి ఏదైనా డిపాజిట్ ఉంటే పైన పేర్కొన్న ఫార్మాలిటీస్ పూర్తి చేసి క్లైయిమ్ చేసుకోండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి